CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Prakasam District Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. కొండపి నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం నర్సింగోలులో నిర్వహించనున్న ‘మీభూమి-మీహక్కు’ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, అనంతరం గ్రామసభకు హాజరుకానున్నారు. గ్రామసభలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. ఇక, సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో భాగంగా రైతులతో జరిగే ముఖాముఖి కార్యక్రమం, గ్రామసభకు ప్రాధాన్యత ఉంది. ఈ కార్యక్రమాల అనంతరం చంద్రబాబు పార్టీ క్యాడర్ సమావేశంలో పాల్గొననున్నారు. పర్యటన సజావుగా సాగేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.
సీఎం చంద్రబాబు పర్యటన పూర్తి షెడ్యూల్
* ఉదయం 10:00 గంటలకు: ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు.
* ఉదయం 10:40 గంటలకు: ప్రకాశం జిల్లా నర్సింగోలు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
* ఉదయం 11:00 గంటలకు: నర్సింగోలులో రైతులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
* ఉదయం 11:45 గంటలకు: గ్రామసభకు హాజరవుతారు.
* గ్రామసభ సందర్భంగా: అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శిస్తారు.
* మధ్యాహ్నం 3:15 గంటలకు: పార్టీ క్యాడర్ సమావేశంలో పాల్గొంటారు.
* సాయంత్రం 4:45 గంటలకు: క్యాడర్ సమావేశం ముగించుకుని బయలుదేరుతారు.
* సాయంత్రం 4:55 గంటలకు: నర్సింగోలు హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు.
* సాయంత్రం 5:35 గంటలకు: ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
Also Read
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
తాజావార్తలు
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!