NTV Telugu Site icon

Prabhakar Chowdary: అధికారం శాశ్వతం కాదు.. గుర్తుంచుకోండి

Prabhakar

Prabhakar

ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. టీడీపీ మాజి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కళ్యాణదుర్గంలో జరిగిన ఘటన పై అధికార పార్టీ నాయకులు మాట్లాడలేక పోతున్నారు. చంద్రబాబు, లోకేష్ ట్విటర్ లో పెడితే దానిపై కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు జగన్ చంద్రబాబు ను నడి రోడ్డులో ఉరి వెయ్యండి అంటే ఏ కేసులు పెట్టలేదన్నారు.

మీ సహచర మాజీమంత్రి కొడాలి నాని, తాజా మంత్రి అంబటి రాంబాబుపై ఎలాంటి కేసులు పెట్టాలి. పోలీసులు విధులు గురించి ఎవరూ మాట్లాడలేదు. వైసీపీ నాయకులు రాజ్యాంగాన్ని తప్పుడు మార్గంలో నడుపుతున్నారని దుయ్యబట్టారు ప్రభాకర్ చౌదరి. ఎవరికి అధికారం శాశ్వతం కాదు.ఇది గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.

Read Also: Dharmana Prasada Rao: రెవిన్యూశాఖపై ఘాటైన వ్యాఖ్యలు