NTV Telugu Site icon

Bheemla Nayak: మైలవరంలో భీమ్లానాయక్ లేనట్టే

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లానాయక్ మేనియా పట్టుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాకావడంతో ఈ మూవీని చూడాలని అభిమానులు ఉత్సాహంగా వున్నారు. అయితే థియేటర్ యజమానులకు ప్రభుత్వం షాకిచ్చింది. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలు వేయడానికి అవకాశం లేదని, అలా కాదని బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తే సినిమాటోగ్రఫీ చట్టం కింద కేసులు నమోదుచేస్తామని రెవిన్యూ అధికారులు స్పష్టం చేయడంతో థియేటర్ యజమానులు దిక్కుతోచక అల్లాడుతున్నారు.

కృష్ణాజిల్లా మైలవరంలో భీమ్లా నాయక్ సినిమాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 35 ప్రకారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మైలవరంలో భీమ్లా నాయక్ ప్రదర్శించే థియేటర్ లకు 35 రూపాయలు కేటాయించడంతో థియేటర్ యజమానులు తీవ్ర అసహనంతో వున్నారు. ఈ రేట్ తమకు గిట్టబాటు కాదని భీమ్లా నాయక్ ప్రదర్శించుటకు సిద్ధంగా లేమని ప్రకటించారు. దీంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు.

గత వారం విడుదలైన సినిమాలకు వంద రూపాయలకు పెంచిన ప్రభుత్వం తమ హీరో సినిమా విడుదల సందర్భంగా జీవో ప్రకారమే టికెట్లు రేట్లు అమ్మాలని చెప్పటం ఎంతవరకు సబబు అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. సినిమాను సినిమాలాగే చూడాలని హీరోలందరి సినిమాలను ప్రభుత్వం ఒకేలా ఆదరించాలని రాజకీయంతో ముడిపెట్టొద్దని అభిమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మరోవైపు చిత్తూరు జిల్లాలో భీమ్లానాయక్ ఫాన్స్ షో కోసం నిరసనలు వ్యక్తం అయ్యాయి. పలమనేరు పట్టణంలో వి.వి.మహల్ థియేటర్ వద్ద జనసేన పార్టీ నాయకులు శ్రేణులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బెనిఫిట్ షో వేయాలని నిరసన తెలిపారు. గతంలో ఎప్పుడూ ఎవరి సినిమాలకు లేనటువంటి నిబంధనలు పవన్ కళ్యాణ్ సినిమాకు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరుపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్.ఐ.నాగరాజు పోలీసు సిబ్బంది, ఎమ్మార్వో కుప్పుస్వామి పరిస్థితిని సమీక్షించారు,