Site icon NTV Telugu

Pothula Sunitha: చంద్రబాబు, అచ్చెన్నకు ఎమ్మెల్సీ సునీత సవాల్

ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. కుప్పం, టెక్కలిలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు రాజీనామాలు చేసి గెలవాలని సవాల్ చేశారు. టీడీపీ హయాంలో కాల్ మనీ నాగులతో సెక్స్ రాకెట్ నడిపించి మహిళల పుస్తెలు తెంచింది చంద్రబాబు కాదా..? అన్నారు సునీత.

మహిళా సంక్షేమంపై చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. భార్యను అడ్డుపెట్టుకుని చంద్రబాబు గ్లిజరిన్ ఏడుపులను ఎవరు నమ్ముతారు?తమ్ముడ్ని పిచ్చివాడిని చేసి గొలుసులతో బంధించిన చంద్రబాబు కుటుంబ విలువలు గురించి మాట్లాడటమా? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు బాహుబలి సినిమాలో భల్లాలదేవుడి లాంటివాడు. ఆ సినిమాలో అతను అధికారం కోసం అర్రులు చాచినట్లే చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం నాడు తనకు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచారన్నారు.

https://ntvtelugu.com/good-news-to-andhra-pradesh-government-women-employees/
Exit mobile version