NTV Telugu Site icon

Pothina Venkata Mahesh: జనసేన నేత అరెస్ట్.. తెల్లవారుజామున 3 గంటలకు విడుదల

Pothina Venkata Mahesh

Pothina Venkata Mahesh

విజయవాడలో జనసేన దిమ్మె విషయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, జనసేన నేతల మధ్య జరిగిన ఘర్షణ.. ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.. ఘటనా స్థలానికి చేరుకున్న జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఈ ఘటనపై పోలీసులను ప్రశ్నించారు. దాంతో పోలీసులు, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట నెలకొంది. పోలీసులు పోతిన మహేష్‌ను అరెస్ట్‌ చేశారు.. భవనీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.. దీంతో పీఎస్‌ దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే.. తెల్లవారు జామున 3 గంటలకు బెయిల్ పై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్‌ను విడుదల చేశారు పోలీసులు..

Read Also: Astrology : సెప్టెంబర్‌ 3, శనివారం దినఫలాలు

పాతబస్తీ రాయల్ ప్యాలెస్ జెండా దిమ్మ కేసులో అరెస్ట్ అయిన పోతిన మహేష్.. భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ఐదు గంటల పాటు విచారణ అనంతరం పలు కేసులు నమోదు చేశారు.. ఐపీసీ 353, 341, 342, 143, 149, 283 సెక్షన్ల కింది మహేష్‌పై కేసులు పెట్టారు.. భవానీపురం పోలీస్ స్టేషన్ నుండి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తరలించిన పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం సూర్యరావుపేట పోలీస్ స్టేషన్ కి తరలించారు.. అక్కడ నుండి తెల్లవారు జామున 3 గంటల సమయంలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.. రిమాండ్ కు పంపించే సెక్షన్లు లేవన్న మేజిస్ట్రేట్ 41ఏ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.. ఇక, టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో 41 ఏ నోటీసులు జారీచేసి తెల్లవారుజామున 3.30 గంటలకు పోతిన వెంకట మహేష్‌ని విడుదల చేశారు పోలీసులు..