ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. భరతనాట్యం, కూచిపూడి నర్తకిగా యామినీ కృష్ణమూర్తి పేరు ప్రఖ్యాతలు గడించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940లో యామినీ కృష్ణమూర్తి జన్మించారు. పద్మ శ్రీ, పద్మ భూషన్, పద్మ విభూషన్ అవార్డులు అందుకున్నారు.
ఇది కూడా చదవండి: Kollywood : ఆగస్టు 15న సినిమాల రిలీజ్ విషయంలో తమిళంలోనూ తీవ్ర పోటీ..
యామినీ కృష్ణమూర్తి 1957లో మద్రాస్‌లో రంగప్రవేశం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్థాన నర్తకి అనే గౌరవం ఉంది. ఆమె కూచిపూడి నృత్య రూపానికి టార్చ బేరర్ అని కూడా పిలుస్తారు. ఇక ఢిల్లీలోని హౌజ్‌ఖాస్‌లోని యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్‌లో యువ నృత్యకారులకు పాఠాలు నేర్పారు. 1968లో పద్మశ్రీ, 2001లో పద్మ భూషణ్, 2016లో పద్మ విభూషణ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇక రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అత్యున్నత పౌర పురస్కారం కూడా లభించింది.
ఇది కూడా చదవండి: Daggubati Purandeswari: రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఎంపీ పర్యటన..
ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ సంతాపం తెలిపారు. ‘భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ఎనలేని ప్రతిభ చూపి, అత్యున్నత స్థాయికి ఎదిగిన ప్రముఖ నృత్య కళాకారిణి పద్మ విభూషణ్ డాక్టర్ యామినీ కృష్ణమూర్తి మరణం పట్ల వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో తనదైన శైలితో అద్భుత ప్రతిభ చూపిన యామినీ కృష్ణమూర్తి శాస్త్రీయ నృత్యంలో చెరగని ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు. యామినీ కృష్ణమూర్తి మరణం శాస్త్రీయ నృత్య రంగంలో తీరని లోటని, ఆమె తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం అని తెలిపారు. యామినీ కృష్ణమూర్తి ఆత్మకు శాంతి కలగాలని జగన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.