Site icon NTV Telugu

Andhra Pradesh: గుడివాడలో ఉద్రిక్తత.. పోలీసులకు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం

Anganwadi Workers

Anganwadi Workers

గుడివాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే‌ను కలిసేందుకు వచ్చిన అంగన్వాడి వర్కర్స్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు, అంగన్వాడీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా ఎమ్మెల్యే కొడాలని నాని కలిసి తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా వినతి పత్రం ఇచ్చేందుకు బుధవారం అంగన్వాడీ వర్కర్స్ గుడివాడ క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని మధ్య దారిలో ఆపేశారు.

Also Read: Karanam Dharmasri: వచ్చే ఎన్నికల్లో సీఎం ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చేస్తా..

అయినా అంగన్వాడీలు వెనక్కి తగ్గేది లేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు బలవంతంగా అంగన్వాడి వర్కర్లను అదుపులోకి తీసుకుని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే వారికి మద్దతు తెలిపిన సీఐటీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రభుత్వ వైఖరి, పోలీసులు తీరుపై అంగన్వాడీ వర్కర్స్ మండిపడ్డారు. తమకు సమస్యలు విన్నవించుకనే అవకాశం కూడా ఈ ప్రభుత్వం కల్పించడంలేదాని వాపోయారు. న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించమంటే పోలీసుల చేత తమను అరెస్ట్ చేయించడం కరెక్ట్ కాందంటూ వైసీపీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.

Also Read: New Year Traffic Alert : న్యూయర్‌ వేడుకల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Exit mobile version