నేడు భైంసా లో గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్త్ చేసారు. ఈ నిమజ్జనానికి మొత్తం 500 మంది పోలీసులతో బందోబస్తుతో పాటుగా 150 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. అదనపు ఎస్పీ తో పాటు ఇద్దరు ఏ ఎస్పీలు 3 డిఎస్పీలు 11 మంది సీఐ లు 36 ఎస్సై లు 251 మంది కానిస్టేబుళ్లు 37 హోంగార్డు లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు అధికారులు. వీటితో పాటు 10 పికెటింగ్ పాయింట్లు 6 బైక్ పార్టీలతో గస్తీ నిర్వహించనున్నారు పోలీసులు. నిమజ్జనం సందర్భంగా ఈ రోజు దుకాణ సముదాయాలు అన్ని మూసివేయాలని పోలీసుల ఆదేశాలు జారీ చేసారు. ఉదయం 10 :30 నిమిషాలకు నిమజ్జనం పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించనుంది ఉత్సవ కమిటీ . గడ్డేన్న వాగు ప్రాజెక్టు లో వినాయక నిమజ్జనంకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు.
భైంసా లో గణేష్ నిమజ్జనం.. 500 మంది పోలీసులతో బందోబస్తు
