Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పోలీస్ నియామకాల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 411 సివిల్, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, 6100 సివిల్, ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కానిస్టేబుల్ పోస్టులకు వచ్చే ఏడాది జనవరి 22న, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న పరీక్షలు నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఈ పోస్టుల దరఖాస్తు తేదీలు త్వరలో ప్రారంభం కానున్నాయి.
Read Also: Viral News: హనుమంతుడు మళ్లీ పుట్టాడు రుజువుకావాలా..?
మొత్తం 6,511 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్‌లో సివిల్ విభాగంలో 3580 పోలీస్ కానిస్టేబుల్, 411 ఎస్ఐ పోస్టులు, 96 రిజర్వ్ ఎస్ఐ పోస్టులు, 2520 ఏపీ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. కాగా ఇటీవల ప్రతి ఏటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇటీవల పోలీసు శాఖను సీఎం జగన్ ఆదేశించారు. ఈమేరకు పోలీసు శాఖ 6,511 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ నాటికి దరఖాస్తుల స్వీకరణ, స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేయనుంది. ఎస్‌ఐ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్‌లో ఉత్తీర్ణులవ్వాలి. కానిస్టేబుల్ పోస్టులకు ఈనెల 30 నుంచి డిసెంబర్ 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరి 9 నుంచి హాల్ టికెట్ల జారీ ఉంటుంది. ఎస్సై పోస్టులకు డిసెంబర్ 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 5 నుంచి హాల్ టికెట్ల జారీ ఉంటుంది.
