Site icon NTV Telugu

Konaseema: కోనసీమ అల్లర్లు.. 46 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Konaseema District

Konaseema District

కోనసీమ జిల్లా పేరు మార్పు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కోనసీమ పేరు మార్పును నిరసిస్తూ రెండురోజుల క్రితం అమలాపురంలో పెద్ద ఎత్తున జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. చివరకు మంత్రి, ఎమ్మెల్యే నివాసాలకు కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను అరెస్ట్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా అమలాపురం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసిన 46 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Minister Botsa: వాళ్లు అధికారంలో ఉంటే అతివృష్టి లేదంటే అనావృష్టి

అమలాపురం అల్లర్లకు సంబంధించి సామర్లకోటకు చెందిన హోంగార్డ్ వాసంశెట్టి సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో పోలీసులు కేసులు బుక్ చేశారు. వాసంశెట్టి సుబ్రహ్మణ్యం వజ్ర పోలీస్ వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసిన జాబితాలో బీజేపీ జిల్లా కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, కాపు ఉద్యమ నేత నల్ల చంద్రరావు కుమారుడు, అన్యం సాయి కూడా ఉన్నారు. కాగా కోనసీమ పూర్తిగా నియంత్రణలోకి వచ్చాకే ఇంటర్నెట్ సేవలు ప్రారంభిస్తామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు.

Exit mobile version