ఈ మధ్య కాలంలో కేటుగాళ్లు ఎక్కువ అయిపోయారు. వారికి అది ఇది అని ఏం పట్టింపులు ఉండవు ఏది దొరికితే అది చోరి చేసేయడమే వారి లక్ష్యం. తాజాగా గుంటూరు నగరంలో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నల్లపాడు గొర్రెల మండి మిర్చి యార్డ్ వద్ద ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసే బత్తుల శ్రీను అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
బత్తుల శ్రీను ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి దగ్గర నుంచి 21 వాహనాలు స్వాధీనం చేసుకొని విచారిస్తున్న నల్లడపాడు పోలీసులు . చెడు వ్యసనాలకు బానిసగా మారి దొంగగా మారిన బత్తుల శ్రీను. దొంగిలించిన వాహనాలను తక్కువ ధరకు గ్రామాల్లో విక్రయిస్తున్నాడని పోలీసులు విచారణలో తెలిపారు. కాగా ఇప్పటి వరకు 21 వాహనాలేనా ఇంకా ఏమైనా దొంగిలించాడా, కేవలం ద్విచక్ర వాహనాలకే శ్రీను పరిమితమయ్యాడా ఇతర నేరాలకు ఏమైనా పాల్పడుతున్నాడా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. వాహనాల దొంగ ను పట్టుకున్న సిబ్బందిని గుంటూరు ఆడిషనల్ ఎస్పీ గంగాధర్ అభినందించారు.
