Site icon NTV Telugu

Fake Darshan Tickets: శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్లు.. పోలీసులకు వరుస ఫిర్యాదులు

Srisailam

Srisailam

Fake Darshan Tickets: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి వారి నకిలీ దర్శనం టికెట్లను అధిక రేట్లకు భక్తులకు అమ్మిన వారిపై దేవస్థానం సీఈవో మదుసూదన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్లు అమ్ముతున్న కేటుగాళ్లపై కేసు నమోదు చేశారు. పాత దర్శనం టికెట్లును ఎడిటింగ్ చేసి భక్తులు అమ్మి మోసం చేసిన ఘటనపై ఇద్దరు నిందితులపై శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషనులో కేసు నమోదు అయింది. నకిలీ టికెట్ల అమ్మకాలు భక్తులు టికెట్లు కొనుగోలుపై అధికారులు, పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read Also: Deepika Padukone: మానసికంగా చాలా కృంగిపోయా

అయితే, శ్రీశైలం దేవస్థానంలో ఫిబ్రవరి 14న శ్రీశైలం మల్లన్న దర్శనానికి కొంతమంది భక్తులు వచ్చారు. దర్శనం టికెట్లు ఇస్తామని చెప్పిన ఇద్దరు వ్యక్తులు వేల రూపాయలు వారి దగ్గర నుంచి కాజేసి ఆ భక్తులకు నకిలీ టికెట్లు ఇచ్చారు. ఇక, వాటిని తీసుకుని సదరు భక్తులు క్యూలైన్‌లో నిలబడ్డారు. తమ వంతు వచ్చే సరికే స్కానింగ్ సెంటర్ దగ్గర టికెట్లు ఇచ్చి లోపలికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు. కానీ, ఆ టికెట్లు స్కానింగ్ కాకపోవడంతో వారిని ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. వాటిని ఫేక్ టికెట్స్‌గా తేల్చారు. దీంతో భక్తులు, దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో.. సీఈవో పోలీసులకు కంప్లైంట్ చేయగా కేసు నమోదు చేసుకుని.. విచారణ చేసి ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version