NTV Telugu Site icon

Housing For All: ప్రతి ఒక్కరికి ఇల్లు.. మోడీ విధానం అదే

Puri1

Puri1

దేశంలో ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఉండాలనేది పీఎం మోడీ ఆలోచన అన్నారు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రధానమంత్రి అవాస్ యోజన ఇల్లు నిర్మిస్తున్నాయన్నారు. విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో హౌసింగ్ ఫర్ ఆల్, పీఎం అవాస్ యోజన ఇళ్ళు లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర హౌసింగ్ మంత్రులు హరిదీప్ సింగ్ పూరి, జోగి రమేష్, ఎంపీ ఎంవివి, ఎమ్మెల్సీ మాధవ్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు, అందజేశారు మంత్రులు హరిదీప్ సింగ్, జోగి రమేష్. అర్బన్ ఏరియాలో కోటి 22 లక్షల మందికి ఇళ్ళు అవసరం అన్నారు కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరి.

ఆంధ్రప్రదేశ్ లో 22 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదనంగా ఇల్లు కావాలని ఆంధ్రదేశ్ ప్రభుత్వం కోరింది. రాష్ట్రంకు మరిన్ని ఇళ్ళు ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్ళు పూర్తిన సందర్భంగా రాష్ట్రానికి వచ్చాను. ప్రధానమంత్రి మోడీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసి దేశ రాష్ట్ర అభివృద్ధికి పని చేస్తారు.

అందరికి ఇల్లు ఇవ్వాలనేది సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి చరిత్ర అన్నారు రాష్ట్ర హౌసింగ్ మంత్రి జోగి రమేష్. ఇళ్లను కట్టుకొనేందుకు సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. 17 వేల కాలనీలు నిర్మిస్తున్నారు. కాలనీల్లో వేల కోట్లు ఖర్చు చేసి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలన్నారు.
Yogi Sarkar : యూపీ అలర్ల సూత్రధారికి.. ‘బుల్డోజర్‌’నోటీసులు