NTV Telugu Site icon

PM Modi : తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా.. అంటూ

Modi Speech

Modi Speech

 

మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు 125వ జయంతిని పురస్కరించుకొని ఏపీలోని భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామ రాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. అంతేకాకుండా అల్లూరి కుటుంబ సభ్యులను, వారసులను ప్రధాని మోడీ సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.. తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా అంటూ తెలుగు ప్రధాని మోడీ ప్రసంగిస్తుండడంతో సభస్థలిలో ఉన్న ప్రజలు కేరింతలు వేశారు. మోడీ మాట్లాడుతూ.. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి అని, ఆయన పుట్టిన ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని, ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందన్నారు.

వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. యావత్‌ దేశానికి అల్లూరి సీతారామరాజు స్పూర్తిదాయకమని, రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తి అయ్యిందన్నారు. అల్లూరికి దశం తరుఫున శ్రద్దాంజలి ఘటిస్తున్నామని, మొగల్లులోని ధ్యానమందిరం, చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మోడీ వెల్లడించారు. లంబ సింగిలో అల్లూరి మెమోరియల్‌, గిరిజన మ్యూజియం నిర్మిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.