నిమజ్జనం కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి.కొత్తూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పిఠాపురం మండలం బి. కొత్తూరులో వినాయక మండపాలు ఏర్పాటు చేసి.. పూజలు నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉంది. నిమజ్జనంనిమజ్జనం రూట్ విషయంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటు చేటుచేసుకుంది. ఈ ఘర్షణలో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి.. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో స్వల్పంగా ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. రెండు వర్గాలను స్థానికులు విడదీసారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాల వారిని విడదీసి.. అక్కడ నుంచి నిమజ్జనానికి వారిని పంపించేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది.