NTV Telugu Site icon

Tirumala: తిరుమలలో తగ్గిన రద్దీ.. అయినా భక్తులకు పరిమితంగానే లడ్డూలు

తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో మూడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ వెల్లడించింది. కంపార్టుమెంట్లలోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదం, పాలు, తాగునీటి సరఫరా చేస్తున్నట్లు వివరించింది. శ్రీవారిని బుధవారం నాడు 66,745 మంది భక్తులు దర్శించుకున్నారని.. 30,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించింది. హుండీ ద్వారా స్వామివారికి రూ.5.14 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ పేర్కొంది.

మరోవైపు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు అధికారులు లడ్డూ ప్రసాదాలను పరిమితంగానే ఇస్తున్నారు. ఉచిత లడ్డూలతో పాటు అదనంగా మరో రెండు లడ్డూలను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటివరకు కావాల్సినన్ని లడ్డూలు ఇస్తుండగా.. ఇటీవల చెన్నైలో టీటీడీ నిర్వహించిన స్వామివారి కళ్యాణానికి భారీగా లడ్డూలను పంపడంతో లడ్డూ ప్రసాదాల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేవలం రెండు అదనపు లడ్డూలను ఇస్తున్నారని భక్తులు ఆవేదన చెందుతున్నారు.

Srisailam Project: నిపుణుల కమిటీ హెచ్చరిక.. శ్రీశైలం డ్యామ్ భద్రతకు ముప్పు