Site icon NTV Telugu

Physical Harassment: రైతు బజార్‌లో కామాంధుడు.. కూరగాయలు అమ్మే మహిళలే టార్గెట్..!

Physical Harassment

Physical Harassment

పేద మహిళలను టార్గెట్ చేసి శారీరక వాంఛ తీర్చుకుంటు బెదిరింపులకు తెగపడుతున్నడు రఫీ అనే దళారి ఆగడాలు రైతు బజార్ లో ప్రకంపనలు పుట్టించాయి… కృష్ణ జిల్లా మచిలీపట్నం స్థానిక రైతు బజార్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. కూరగాయల హోల్ సేల్ వ్యాపారం ముసుగులో రఫీ చేసే వికృత చేష్టలు అక్కడ కూరగాయలు అమ్ముకునే మహిళా వ్యాపారుల పాలిట శాపంగా మారాయి. బతుకుతెరువు కోసం కొంతమంది మహిళలు రైతు బజార్ లో కూరగాయల అమ్ముతూ తమ జీవితాన్ని వెళ్లదీసుకుంటారు.. వీరి అవసరాలను ఆసరాగా తీసుకుని వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు రఫీ అనే దళారీ… ఎంతో మంది అమాయకపు మహిళలు అనుభవిస్తూ మానసిక వేధింపులకు తెగపడుతున్నాడు. రైతు బజార్‌లో వీడు చేసే వెకిలి చేష్టలు, శారీరక వేధింపులు భరించలేని మహిళలలు ఎదిరించలేక ఆందోళనకు గురవుతున్నారు.

Read Also: YSRCP: మాజీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్‌ వేటు.. వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో నిర్ణయం..

ఈ కామాంధుదుని ఎదిరించి రైతుబజార్‌లో తమ కూరగాయల వ్యాపారం కొనసాగించలేని కొంత మంది పేద మహిళలు.. వాడు చెప్పినట్లు తల వంచాక తప్పటం లేదు. అమాయకపు మహిళలే లక్ష్యంగా ఇతను చేసే చేష్టలకు రైతు బజార్ లో హద్దు అదుపు లేదు. పెడనకు చెందిన ఈ కామాంధుడి శరీర వాంఛకు అనేకమంది మహిళలు ఇప్పటికే బలైపోయారు. ఇదిలా ఉండగా ఈ నెల 16న ఒక ప్రభుత్వ ఉద్యోగినితో పెళ్ళి చేసుకోవటానికి ముస్తాబవుతున్నాడి కామాంధుడు.. ఎప్పటి నుండో రైతు బజార్ లో వ్యాపారం పేరుతో ఇతను చేసే దారుణాలు తెలిసిన రైతు బజార్ అధికారులు పట్టించుకోవడం లేదని.. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కామాంధుడిపై తగిన చర్యలు తీసుకుని అమాయక మహిళలను కాపాడాలని కోరుతున్నారు.

Exit mobile version