అసలే ఆకాశాన్నంటుతున్నాయి పెట్రోల్, డీజిల్ ధరలు. దీనికి తోడు మాఫియా రెచ్చిపోతోంది. కృష్ణాజిల్లాలో రెచ్చిపోతుంది పెట్రోల్,డీజిల్ మాఫియా. ట్యాంకర్లలోనే ఫేక్ కొలతలతో పెట్రోల్ చోరీ జరిగిపోతోంది. ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారు మాఫియా నిర్వాహకులు. జిల్లాలోని కృత్తివెన్ను పెట్రోల్ బంక్ లో పట్టుపడ్డ పెట్రోల్ మాఫియా బాగోతం అందరినీ విస్మయానికి గురిచేసింది. డీలర్లను మోసం చేసి పెట్రోల్ అమ్ముకుంటున్నారు మాఫియా కేటుగాళ్లు. డీలర్స్ కు దొరకకుండా ట్యాంకర్లలో ఏర్పాట్లు చేసుకోవడం కొసమెరుపు.
ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెట్రోల్ డీలర్స్. పట్టు పడ్డ లెక్క చెయ్యడం లేదు మాఫియా. పైగా తమను ఎదిరిస్తే దాడులు తప్పవని హెచ్చరికలు జారీచేస్తున్నారు. తాడిని తన్నేవాడు ఒకడుంటే తలను తన్నేవాడు మరొకరు ఉంటాడు అనేది సామెత. అది అప్పుడు ఎంత నిజం అయ్యేది తెలీదు గానీ ఇప్పుడు మాత్రం అక్షరాలా నిజం అవుతోంది. ఇప్పటివరకు కొంతమంది పెట్రోల్ బంక్ యజమానులే వినియోగదారులను బురిడీ కొట్టించడం చూసుంటాం. కానీ వారిని సైతం దోసెస్తున్నారు కొంతమంది ఘరానా మోసగాళ్లు.
ఏకంగా డీలర్ల వద్దే పెట్రోల్, డీజిల్ ను మాయం చేసేస్తున్నారు ఈ మాఫియా. .కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాలకు విజయవాడ కొండపల్లి వద్ద నుండి ఇండియన్ ఆయిల్ కంపెనీ ట్యాంకర్లు ద్వారా సరఫరా చేస్తారు. ఒక ట్యాంకర్ లో మూడు కంపార్ట్మెంట్ల అమరిక ఉంటుంది. అందులో ఒక్కొక్క కంపార్ట్మెంట్ కు 4000 లీటర్ల చొప్పున మొత్తం 12,000 లీటర్లు పెట్రోల్ పడుతుంది. దీనిని పెట్రోల్ బంకుకి సరఫరా చేస్తారు.
Read Also: Kerala High Court: ప్రసవ వేదన భరించేది స్త్రీనే.. గర్భం దాల్చడం ఆమె ఇష్టం…
అలా సరఫరా చేసే ట్యాంకర్లలోనే పెట్రోల్ ,డీజిల్ ను దొంగిలించేస్తున్నారు ఘరానా దొంగలు. అలా దొంగిలించినా దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. అనుమానం వచ్చిన కృష్ణా జిల్లాలోని కొందరు పెట్రోల్, డీజిల్ డీలర్లు కృష్ణా జిల్లా కృతివెన్నులో చెక్ చెయ్యగా అసలు విషయం బయటపడింది. ట్యాంకర్ల మోసాన్ని గమనించిన డీలర్లు అధికారులకు ఫిర్యాదు చేసారు. మొత్తానికి వినియోగదారుల్ని మోసం చేసే డీలర్లనే మోసం చేసే మాయామశ్చీంద్రలు వచ్చేశారన్నమాట.
Read Also: Batukamma: రేఖా శ్రీ ‘సన్న జాజుల బతుకమ్మ’
