VIral News: కోడిపుంజు మిస్సింగ్.. తలపట్టుకుంటున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా ఇంట్లో కుక్క పిల్ల తప్పిపోయింది వెతికిపెట్టండి. మా ఇంట్లో పిల్లి కనిపించడం లేదు. మా ఇంట్లో నెక్లెస్ పోయింది.. వాళ్ళ మీద అనుమానంగా వుంది. ఆ సంగతి చూడండి అంటూ పోలీసులకు కంప్లైంట్లు రావడం కామన్. అసలే రాజకీయంగా ఎవరిమీద కేసులు పెట్టాలి, అధికార పార్టీ నేతల నుంచి వచ్చే కంప్లైంట్స్ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న రోజులివి. దానికి తోడు ఇతర నేరవార్తలు వారిని నిలువ నీయకుండా చేస్తుంటాయి. బంగారు, నగదు దోచుకెళ్లారని తరచూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం పరిపాటి. అయితే దానికి భిన్నంగా ఈ ఘటన చోటచేసుకుంది.
అదేదో సినిమాలో పెన్సిల్ పోయిందని ఓ కుర్రాడు కంప్లైంట్ ఇస్తాడు. అచ్చం అలాంటిదే ఇప్పుడో విచిత్రమయిన కంప్లైంట్ పోలీసులకు అందింది. తన తెల్ల కోడిపుంజును దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు అందింది.ఈ చిత్రమయిన కంప్లైంట్ చూసిన పోలీసులకు తలనొప్పి వచ్చింది. ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి వెంకటాద్రి. అల్లారుముద్దుగా పెంచుకున్న జాతి కోడిపుంజును దొంగలు ఎత్తుకెళ్లారని అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం పోలీస్ స్టేషన్లో అరుదైన ఫిర్యాదు చేశాడు వెంకటాద్రి. గత నెల 29 వ తేదీన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆలస్యంగా వెలుగు చూసిన అరుదైన ఫిర్యాదు చూసి జనం నవ్వుకుంటుంటే… ఈ కోడిపుంజు దొంగను ఎలా పట్టుకోవాలో తెలీక తెగ ఇదై పోతున్నారు ఖాకీలు.
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
వాల్మీకిపురం మండలం, తాటిగుంటపల్లి పంచాయతీ పరిధిలోని పెద్దవంకపల్లెకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి లక్ష్మయ్య కుమారుడు వెంకటాద్రి కోడిపుంజు చోరీపై లబోదిబోమంటూ వాల్మీకిపురం పోలీసులను ఆశ్రయించాడు. ఏడాదిన్నర క్రితం తమిళనాడు రాష్ట్రం, సేలం నుంచి జాతి పుంజులను తెచ్చుకొని పెంచుతున్నాడు. అందులో ఒక్కగానొక్క పుంజు మాత్రమే బతకడంతో ఆ పుంజును ఎంతో ఇష్టంగా పెంచి పోషించారు. వీరికి పుంజులను పెంచే అలవాటు వుంది. మూడు రోజుల క్రితం దొంగలు రూ. 9 వేలు విలువగల జాతి కోడి పుంజును ఎత్తుకెళ్లారు.
ఎంతో మురిపంగా పెంచుకున్న జాతి కోడి పుంజులు దొంగిలించారని వెంకటాద్రి వాల్మీకిపురం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పెద్దవంక గ్రామ పరిసరాల్లో తరచూ కోడిపందాలు జరుగుతుంటాయని, పందాల కోసమే దొంగలు అపహరించి వెళ్లారని అనుమానం వ్యక్తం చేసాడు. అయితే ఇందుకు భిన్నంగా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలతో సమానంగా పెంచుకున్న కోడిపుంజును దొంగలు ఎత్తుకెళ్ళారని ఫిర్యాదు చేయడం చేయడం గమనార్హం. నా కోడి పుంజు నాకు తెచ్చి ఇవ్వాలని వెంకటాద్రి వాల్మీకిపురం పోలీసులకు వేడుకుంటున్నాడు. వెంకటాద్రి ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని విచారణ చేస్తున్నామని ఎస్ఐ బిందు మాధవి మీడియాకు తెలిపారు. మీకు ఆ కోడిపుంజు కనిపిస్తే పోలీసులకు చెప్పి పుణ్యం కట్టుకోండి. వాళ్ళ తలనొప్పి తగ్గించండి.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!