Site icon NTV Telugu

తెలంగాణ నేతల వాదన రాజకీయాల కోసమే : పేర్ని నాని

Perni Nani

కృష్ణా జల వివాదంలో తెలంగాణ నేతల వాదన రాజకీయ అవసరమేనని… ఉద్వేగాలను.. భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల తెలుగు రాష్ట్రాలకు దమ్మిడి ఉపయోగం ఉందా..?అని ప్రశ్నించారు మంత్రి పేర్ని నాని. ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువగా చెంచాడు నీటిని కూడా తీసుకోవడం లేదని.. కృష్ణా జల వివాదంపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ తో చర్చలు జరపడానికి ఏపీ సీఎం జగన్ సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాలకు ఇరిగేషన్ పరంగా ఎంతో మేలు చేశారని తెలిపారు. టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో సుప్రీం సూచనల మేరకు పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

read also : పోతిరెడ్డిపాడు పాపం… కెసిఆర్ దే !

ఈ నిర్ణయంతో చంద్రబాబు విలయతాండవం చేస్తున్నారని… పరీక్షల రద్దుతో చంద్రబాబు మానసిక ఆనందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అబ్బాయి లేదా మా అబ్బాయిని చదివించేందుకు రామలింగ రాజు లాంటి డబ్బున్న వాడు ముందుకొస్తాడు.. కానీ పేదల పిల్లలను చదివించేందుకు ఎవరు ముందుకొస్తారు..? ప్రశ్నించారు. పిల్లలకు మేలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంటే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Exit mobile version