Site icon NTV Telugu

Perni Nani: కోటంరెడ్డిది నమ్మక ద్రోహం.. చంద్రబాబుతో టచ్‌లో ఉన్నాడు కాబట్టే..!

Perni Nani

Perni Nani

Perni Nani:నెల్లూరు రాజకీయాల్లో కాకరేపుతోన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎపిసోడ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని.. కోటంరెడ్డి చేసింది నమ్మక ద్రోహమన్న ఆయన.. సీఎం వైఎస్‌ జగన్ నమ్మి టికెట్ ఇస్తే ఇలా చేయటం తప్పు అని హితవుపలికారు.. ఇక, పక్షులు వలస వెళ్లే కాలం ఇదంటూ ఎద్దేవా చేశారు.. మేం కూడా విచారణ చేయమని అడుగుతాం.. ఏముంది దాంట్లో.. కానీ, లోకేష్ తో టచ్ లో ఉండొచ్చా? అని నిలదీశారు. డిసెంబర్ 27న బుధవారం బెంజ్ కారులో కోటంరెడ్డి.. హైదరాబాద్ వెళ్లి వచ్చాడని అంటున్నారు.. అంతేకాదు.. ఆరోగ్యం బాగోపోతే ఫోన్ చేశారట.. మరి నా ఆరోగ్యం బాగోలేనప్పుడు నాకెందుకు లోకేష్, చంద్రబాబు ఫోన్ చేయలేదు? అని ఎద్దేవా ఏచశారు.. అసలు, నిఖార్సుగా ఉంటే ఫోన్ ట్యాపింగ్ తో భయపడటం ఎందుకు ? అని మండిపడ్డారు.

Read Also: Bandisanjay-Revanthreddy: ఇక్కడ మాటల తూటాలు.. ఢిల్లీలో షేక్ హ్యాండ్ లు

కోటంరెడ్డి నా భక్తుడనే మత్తులో సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నారు.. నిజంగా నిఘా పెట్టి ఉంటే లోకేష్ తో టచ్ లో ఉన్న విషయం ఎప్పుడో తెలిసేది కదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్నినాని.. ఎమ్మెల్యే పదవి చిన్నదా? రెండు సార్లు ఎమ్మెల్యే చేయటం అంటే చిన్న విషయమా? అని నిలదీశారు. రాజకీయాల్లో సామాజిక, జిల్లా సమీకరణాలు ఉంటాయి.. వాటిని దృష్టిలో పెట్టుకునే పదవుల కేటాయింపులు ఉంటాయన్నారు.. ఇక, రాజశేఖరరెడ్డి కొడుకుగానే వైఎస్‌ జగన్ ను అభిమానించాను.. పదవుల గురించి చూసుకుంటే రాజకీయ అవసరాలు అవుతాయి.. కానీ, అభిమానం అవ్వదని కీలక వ్యాఖ్యలు చేశారు.. మరోవైపు.. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఎవరి ట్రాప్ లోనో పడ్డాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్నినాని. కాగా, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యలు, ఫోన్‌ ట్యాపింగ్‌ కామెంట్లు సంచలనంగా మారిన విషయం విదితమే.

Exit mobile version