Perni Nani Fires On Nara Lokesh Comments: తన పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భయం, బెరుకు లేకుండా లోకేష్ బరితెగించి అబద్ధాలు మాట్లాడాడని ఫైర్ అయ్యారు. బందర్ పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్‌ను టీడీపీ హయాంలో పూర్తి చేశారని, 5 ఏళ్ళల్లో 5 లక్షల ఉద్యోగాలను వాళ్ళ నాన్న ఇచ్చాడని, అమరావతిని పూర్తి చేయడంతో పాటు మోడీ మెడలు చంద్రబాబు వంచాడంటూ లోకేష్ పచ్చి అబద్ధాలు చెప్పాడని మండిపడ్డారు. లోకేష్ చెప్పినట్లు ఇవన్నీ చంద్రబాబు చేస్తే.. మరి ప్రజలెందుకు మిమ్మల్ని కైమా కైమా చేసి ఇంటికి పంపించారు? అని పేర్ని నాని ప్రశ్నించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే చంద్రబాబు చెత్త నాయకుడని, ఎందుకు పనికి రాడని, అధికారంలోకి రాగానే కార్యకర్తలను పక్కన పెట్టేస్తాడని అంటున్నాడని చెప్పారు. పోలీసుల మధ్య బతికిన బతుకు చంద్రబాబు, లోకేష్‌ది అని దుయ్యబట్టారు. పోలీసుల లేకుండా వాళ్లిద్దరు అడుగు కూడా బయటకు పెట్టలేరని విమర్శించారు. అయినా పోలీసుల్ని కించపరుస్తూ మాట్లాడడానికి వాళ్లకు సిగ్గు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rahul Jodo Yatra: ఝలక్ ఇచ్చిన భద్రతా సిబ్బంది.. జోడో యాత్ర నిలిపివేత
అంతకుముందు.. చంద్రబాబుకు తన కొడుకు లోకేష్‌పై నమ్మకం లేదని పేర్ని నాని వ్యాఖ్యానించారు. కొడుకు పాదయాత్రకు సంబంధించిన పోస్టర్‌లో తండ్రి ఫోటో లేదని.. చంద్రబాబు బతికి ఉండగానే ఆయన ఫోటో లేకుండా లోకేష్ రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు సంధించారు. చంద్రబాబుకు తన దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్‌పైనే ఎక్కువ నమ్మకం ఉందని, కానీ ఆ దత్తపుత్రుడేమో బీజేపీతో ఉంటూ చంద్రబాబుకు సైగ చేస్తుంటారని సెటైర్లు వేశారు. ఏమాత్రం వ్యక్తిత్వం లేనివారితో తాము రోజూ పోరాటం చేయాల్సి వస్తోందని, ఇది నిజంగా దురదృష్టకరమని చెప్పారు. అయితే.. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోరాటం చేయలేరన్నారు. ఆ పార్టీలన్ని పొత్తు పెట్టుకున్నప్పటికీ.. వారికి అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఈ విషయం చంద్రబాబు, పవన్‌కు బాగా తెలుసని.. ఎంతమంది, ఎన్ని పార్టీలతో కలిసొచ్చినా వైఎస్ జగన్‌ను అంగుళం కూడా కదపలేరని తేల్చి చెప్పారు.
Google: హెచ్‌ఆర్‌కి ట్విస్ట్ ఇచ్చిన గూగుల్.. ఇంటర్వ్యూ చేస్తుండగానే..