ఈమధ్యకాలంలో అడవుల్లో పులులు రోడ్లమీదకు వచ్చేస్తున్నాయి. జనాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంచారం సంచలనం రేపుతున్నాయి. కొంతమంది వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో పులులు సంచారం చేస్తున్నాయనే వీడియోలు ప్రజలను దడ పుట్టిస్తున్నాయి. గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో పులులు సంచరించినట్లుగా కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేసారు. వీడియోలు ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరల్ అయిన వీడియోలు హాట్ టాపిక్ గా మారాయి.
గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో గిద్దలూరు నుండి నంద్యాలకు ద్విచక్ర వాహన దారులు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. దీంతో వైరల్ అయిన పులి వీడియోలు వల్ల స్థానికులు ఠారెత్తిపోతున్నారు. అయితే సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన ఈ వీడియోలు మాత్రం ఫేక్ వీడియోలంటూ అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంచారం పెరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గతంలోనే అధికారులు ప్రజలను హెచ్చరించారు.