ఏపీలోని పల్నాడు జిల్లాలో ఓ నయా మోసం వెలుగు చూసింది. మృతి చెందిన తండ్రి బ్రతికే ఉన్నాడని చూపించి.. ఓ వ్యక్తి వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. సుమారు 12 సంవత్సరాల నుంచి రూ.4 లక్షల మేర పెన్షన్ డబ్బులు డ్రా చేశాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో, ఈ మోసం వెలుగు చూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరుకు చెందిన పారా కిరీటి 2001లో అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన బతికి ఉన్నప్పుడు.. ఏనాడూ ఎప్పుడూ పింఛను తీసుకున్న దాఖలాలు లేవు.
Kavya : అలాంటి సీన్స్ చేయడానికి సిద్ధం అంటున్న బలగం బ్యూటీ కావ్య..!!
అయితే.. కిరీటి చిన్న కుమారుడు మాత్రం ఓ స్కెచ్ వేశాడు. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ డబ్బుల్ని కాజేసేందుకు పక్కా ప్రణాళిక రచించాడు. 2011లో తన మామను తండ్రిగా చూపించి, ఫేక్ డాక్యుమెంట్లతో పింఛన్ కోసం దరఖాస్తు చేశాడు. అతడు సమర్పించిన వివరాలు నిజమేననుకున్న అధికారులు.. ఆ ఏడాదిలోనే పింఛను మంజూరు చేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకూ.. చనిపోయిన తన తండ్రి పేరు మీద అతడు వృద్ధాప్య పింఛన్ అందుకుంటూ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న కిరీటి బంధువులు పారా బాబూరావు, పారా జ్యోతి, పారా క్రాంతి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చనిపోయిన పారా కిరీటీ పేరు మీద.. ఆయన కుమారుడు అక్రమంగా పెన్షన్ డబ్బులు డ్రా చేస్తున్నాడని ఆధారాలు సమర్పించారు.
Lifestyle : 18 ఏళ్ల వయస్సులో అమ్మాయిలు, అబ్బాయిలు చెయ్యకూడని తప్పులు?
గత 12 సంవత్సరాల నుంచి సుమారు రూ. 4 లక్షలు పెన్షన్ల రూపంలో ప్రభుత్వ ఆదాయాన్ని కాజేశాడని.. కిరీటి కుమారుడిపై జాయింట్ కలెక్టర్‌కు కిరీటీ బంధువులు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనను తెలుసుకొని పల్నాడు జిల్లా ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. దీనిపై తక్షణమే దర్యాప్తు చేయాలని.. జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు.