NTV Telugu Site icon

Peddireddy Ramachandrareddy: 93శాతం హామీలు నెరవేర్చాం

Pedyreddy

Pedyreddy

సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో 93 శాతం అమలు చేశాం. చంద్రబాబు హయాంలో కేవలము కొంత మందికే పథకాలు అందేవన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జన్మభూమి కమిటీ ఆమోదిస్తేనే పథకాలు అందేవి. ఈరోజు కులం, మతం, పార్టీ చూడకుండా కేవలం పేదరికం చూసే పథకాలు అందిస్తున్నాం. ఎక్కడా లంచాలకు తావు లేకుండా అకౌంట్ లో డబ్బులు జమ అవుతున్నాయి. రైతులు మీటర్లు బిగిస్తే ఉరి తాడు వేసుకున్నట్టే అని చంద్రబాబు అంటున్నారు.

గతంలో ఉచిత కరెంట్ అంటే కరెంట్ తీగల పై బట్టలు ఆరేసుకోవాలన్నారు, కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసి చూపారు. నేడు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఇది చేసి చూపుతారు. దేశ విదేశాల్లో రైతు భరోసా పై చర్చ జరుగుతుంది. అనేక రాష్ట్రాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఆఫ్రికా దేశాల్లో కూడా రైతు భరోసా కేంద్రాలు పెట్టాలని ప్రపంచబ్యాంకు కోరిందన్నారు. నూరు శాతం విద్యుత్ ఇస్తున్నాం. కేవలం చంద్రబాబు మాత్రమే గోబెల్స్ ప్రచారం చేస్తారు, ప్రజలతో రాజకీయం చేస్తారని మండిపడ్డారు.

4వ ఏడాది వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పూతలపట్టు నియోజకవర్గం లో వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ సంబంధిత స్టాల్స్ ను పరిశీలించి, అధికారులను అభినందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు ఎంపీ ఎన్. రెడ్డప్ప, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Thomas Cup : చరిత్ర సృష్టించిన భారత జట్టుకు కోటి రూపాయల బహుమతి