Site icon NTV Telugu

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీసీ విజ‌యం ఖాయం : పెద్దిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ వైసీసీ పార్టీ భారీ విజ‌యం సాధించ‌డం ఖాయమ‌ని.. మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సంద‌ర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ…. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు.

https://ntvtelugu.com/mudragada-padmanabham-letter-ap-cm-jagan/

అక్కడక్కడే పరిష్కరించే సమస్యలు కొన్ని మాత్రమే ఉన్నాయని.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందని వెల్ల‌డించారు. ఇదే త‌ర‌హాలో పాలన సాగితే ఈ సారి మరింత భారీ విజయం సాధించడం ఖాయమ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. వైసీపీ ఓట్ల శాతం కూడా భారీగా పెరిగుతుందని.. త‌న కున్న అనుభవం ప్రకారం చూస్తే మళ్ళీ వైఎస్ జగన్ భారీ విజయం సాధిస్తారని పేర్కొన్నారు పెద్దిరెడ్డి.

Exit mobile version