Site icon NTV Telugu

Payyavula Keshav vs Perni Nani: పేర్నినాని, పయ్యావుల మధ్య ఆసక్తికర చర్చ.. 1994 ఫలితాలు రిపీట్..!

Payyavula Keshav Vs Perni N

Payyavula Keshav Vs Perni N

Payyavula Keshav vs Perni Nani: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది.. అయితే, అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య ఎంత వాడీవేడీగా చర్చ సాగినా.. లాబీల్లో మాత్రం.. కొన్నిసార్లు ఆసక్తికరమైన ఘటనలు చోటుచేసుకుంటాయి.. ఇవాళ లాబీల్లో మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పేర్ని నాని-టీడీపీ సీనియర్‌ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.. ఎలా ఉన్నారంటే.. ఎలా ఉన్నారంటూ పరస్పరం పలకరించుకున్నారు ఇద్దరు నేతలు. అయితే, మళ్లీ పయ్యావుల కేశవ్ గెలవాలని కోరుకుంటున్నానన్న పేర్నినాని.. ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదన్న సెంటిమెంట్‌ను గుర్తు చేశారు.. అయితే, దీనిపై తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు పయ్యావుల… నో డౌట్ 1994 ఫలితాలు.. 2024లో రిపీట్ అవుతాయని పేర్కొన్నాడు.. 1994లో ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ గెలిచింది.. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు పయ్యావుల కేశవ్‌.

Read Also: TSPSC : పేపర్ లీకేజీపై దుమారం.. టీఎస్పీఎస్సీ ఆఫీస్‌ వద్ద హైటెన్షన్

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్‌ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయిన విషయం విదితమే.. తొలి రోజు అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించిన తర్వాత సభ వాయిదా పడింది.. ఇక, అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత.. శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం నిర్వహించారు.. మొత్తంగా 9 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది బీఏసీ.. అంటే ఈ నెల 24వ తేదీ వరకు బడ్జెట్‌ సమావేశాలు కొనసాగించనున్నారు.. ఇక, ఈ నెల 16వ తేదీన అంటే గురువారం రోజు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. మరోవైపు.. ఆదివారం కావడంతో ఈ నెల 19వ తేదీన.. ఉగాది సందర్భంగా ఈ నెల 22వ తేదీన అసెంబ్లీకి సెలవుగా బీఏసీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

Exit mobile version