ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్… హంద్రీనీవా ఆయకట్టు విషయంలో ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఆయన.. గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాలలో కాలువ కింద 20 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని.. కనీసం 50 రోజులు నీటి అవసరం ఉందని తన లేఖ ద్వారా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు… హెచ్ఎల్సీ నుంచి జీబీసీ, ఇంద్రావతి డీప్ కట్ ద్వారా హంద్రీనీవాకి నీటిని మళ్లించే అవకాశం ఉందని… ఈ విధానంలో సులభంగా నీరుని ఇవ్వొచ్చని పేర్కొన్నారు.. ఇక, రైతుల పంటలను కాపాడే అవకాశం ఉందని.. పది రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. తక్షణమే నీటిని పంపిణీ చేసి పంటలను ఆదుకోవాలని.. ఆ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని.. సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు పయ్యావుల కేశవ్.
Read Also: AP High Court: జడ్జీలను దూషించిన కేసు.. యుట్యూబ్‌పై హైకోర్టు సీరియస్