జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖ పర్యటన ఖరారైంది… జనసేనాని పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది ఆ పార్టీ.. ఉక్కు పరిరక్షణ పోరాట ఉద్యమానికి సంఘీభావం తెలపనున్న పవన్ కల్యాణ్.. ఈనెల 31 మధ్యాహ్నం ఉక్కు పరిరక్షణ సభలో పాల్గొంటారని వెల్లడించింది.. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుండగా… విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ను వదులుకోవడానికి సిద్ధంగాలేని కార్మిక, ప్రజాసంఘాలు ఆందోళన చేస్తూ వస్తున్నాయి.. వారికి వివిధ రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతుండగా.. ఇప్పుడు ఉక్కు పరిరక్షణ సభలో పాల్గొననున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
Read Also: రేషన్ డీలర్ల ఆందోళనకు బ్రేక్…!
మరోవైపు, ఉపాధి కోసం గిరిజనులు గంజాయ్ ఉచ్చులో చిక్కుకుని నేరస్తులుగా మారుతున్నారు అని మండిపడ్డారు జనసేన అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్… ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చుచేసి వుంటే గిరిజన యువత దారి తప్పే పరిస్ధితి వుండేది కాదన్నారు.. ఏవోబీని జల్లెడపట్టే వ్యవస్ధ పోలీసుశాఖకు వున్నప్పుడు గంజాయి అక్రమ రవాణా ఎందుకు ఆగడం లేదు? అని ప్రశ్నించారు. కొందరు అధికారపార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల మీదుగా గంజాయి తరలిపోవడం ప్రభుత్వంకు కంపించడం లేదా…!? అంటూ నిలదీశారు సుందరపు విజయ్ కుమార్.