Site icon NTV Telugu

Pawan Kalyan : అటవీ సిబ్బంది భద్రత కోసం ‘సంజీవని’

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : ఏపీ రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులను డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్మరించారు. వారి త్యాగం ఎన్నటికీ మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను పట్టుకునే ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించి ప్రాణాలు కోల్పోయిన అటవీ శాఖ ఉన్నతాధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్ (IFS) ను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.

Abhinay: తమిళ నటుడు అభినయ్ హఠాన్మరణం

ఆయన చేసిన సేవలు, చూపిన ధైర్యం ప్రతీ అటవీ సిబ్బందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. “ప్రతీ అమరవీరుని వెనుక ఒక కుటుంబం ఉంటుంది. వారు తమ ఆత్మీయుడిని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ, సమాజం కోసం చూపిన త్యాగం అమూల్యం. రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాల పక్కన నిలిచి, వారి సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుంది,” అని పవన్ కళ్యాణ్ తెలిపారు. అడవులను సంరక్షించేందుకు నిస్వార్థంగా సేవ చేస్తున్న అటవీ సిబ్బంది భద్రత కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని, ‘సంజీవని’ ద్వారా మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు.

Bus Driver Saves 50 Students: నిజమైన హీరో.. 50 మంది విద్యార్థులను కాపాడి.. ప్రాణాలు విడిచిన స్కూల్‌ బస్సు డ్రైవర్‌..

Exit mobile version