Pawan Kalyan Says There Is Strong Change Need In Andhra Pradesh: ఏపీలో బలమైన మార్పు తీసుకురావాలని జనసేనాధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మంగళగిరిలో ఆమంచి స్వాములును పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించిన అనంతరం పవన్ మాట్లాడుతూ.. తాను చీరాలలోనే పెరిగానని గుర్తు చేసుకున్నారు. చీరాల అనగానే చినరధం, పెద్ద రధం, జాలరీ పేట గుర్తొచ్చాయని అన్నారు. ఆమంచి స్వాములకు చీరాలలోనే బలం ఉందని తాను అనుకున్నానని.. కానీ విజయవాడ, గుంటూరు, ప్రకాశం నుంచి కూడా అభిమానులు ఉంటారని అనుకోలేదని చెప్పారు. ఆయన కోసం వచ్చిన అభిమానులు, కార్యకర్తలను చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు.
West Bengal: బెంగాల్లో దెబ్బతిన్న పాఠశాలలు.. కారణమదే!
ఆమంచి స్వాములు లాంటి నేతలు జనసేనలో ఉండాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ తన మనసులోని మాటని బయటపెట్టారు. రాష్ట్రంలో సరికొత్త మార్పుకి, కొత్త భవిష్యత్తుకి నాంది పలకాలని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే.. సీఎం జగన్ పోవాలని నినదించారు. రాజ్యం.. రాజ్యాధికారం ఒక్కరే చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. మన భవిష్యత్తును వేరే వాళ్లు నడిపిస్తామంటే కుదరదని పేర్కొన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మనకు అండగా ఉంటాయన్నారు. జనసేన ఎదుగుదలను ఎవరు అడ్డుకుంటారో చూద్దామని సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాలో జనసేన నేత మీద దెబ్బ పడితే.. తన మీద పడినట్టేనని పేర్కొన్నారు. అలాగే.. ఆమంచి స్వాములు మీద దెబ్బ పడితే, తన మీద పడ్డట్టేనని వెల్లడించారు. జనసేన కార్యకర్తలు, నేతల ప్రాణాలకు తన ప్రాణం అడ్డేస్తానని మాటిచ్చారు.
PM Modi: బుర్జ్ ఖలీఫాపై భారత ప్రధాని మోడీ ఫోటో
ఇదిలావుండగా.. ఇటీవల చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఆమంచి స్వాములు ఫోటోతో కూడిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన జనసేనలో చేరబోతున్నారా? అని డిబేట్‌లు జరిగాయి. ఈ నేపథ్యంలోనే.. ఆమంచి స్వాములు శనివారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. ఆయన్ను పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.