ఏపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు. అన్నదాతల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. రైతులకు భరోసా ఇచ్చేందుకే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ యాత్రలు చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ వివరించారు. ఈనెల 23న పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని ఆయన తెలిపారు.
రైతుల కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు త్వరలో గుంటూరు జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల ఒక్కో కుటుంబానికి జనసేన పార్టీ తరఫున రూ.లక్ష సాయం అందిస్తామన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యల వివరాలు ప్రభుత్వం బయటకు రానీయటం లేదని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కరెంట్ కోతలతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని.. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని అధ్వాన్నంగా తయారుచేశారని ఫైర్ అయ్యారు. కరెంట్ కోతలపై గ్రామాల్లో ప్రజలు ఎక్కడికక్కడ రోడ్లెక్కుతుంటే.. సీఎం జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావడం లేదని విమర్శించారు.
Supreme Court: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై కీలక ఆదేశాలు.. రేపటిలోగా వివరాలు సమర్పించాలి
