NTV Telugu Site icon

Pawan Kalyan: దేనికీ గర్జనలు? పవన్ పవర్ పంచ్ లు

pawan n

Fzhv5ygagaajxy6

ఏపీలో ఒకవైపు వికేంద్రీకరణ అంటూ మంత్రులు, ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటుచేస్తున్నారు. వికేంద్రీకరణ, మూడురాజధానులను వ్యతిరేకించేవారిపై విమర్శల దాడి చేస్తున్నారు. రాష్ట్రంలో పాలనపై తనదైన రీతిలో పంచ్ లు వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

దేనికీ గర్జనలు అంటూ వైసీపీ నేతలపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా?ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకా? మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నై వెళ్లిపోతున్నందుకా?విశాఖపట్నంలో ఋషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకొంటున్నందుకా? దసపల్లా భూములను మీ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా? అని పవన్ ప్రశ్నించారు.

అందమైన అరకును గంజాయికి కేరాఫ్ అడ్రస్సుగా మార్చారు.

గంజాయి కేసుల్లో ఏపీని మొదటి స్థానంలో నిలిపారు.

రోడ్లు వేయడం లేదు.. చెత్త మీద పన్నులు వేస్తున్నారు.

పీఆర్సీపై మాట మార్చారు.. ఉద్యోగులకు జీతావివ్వడం లేదు.. పోలీసులకు టీఏ, డీఏలు ఇవ్వడం లేదు.

మూడు రాజధానుల పేరుతో ఏపీని ఇంకా అధోగతి పాల్జేస్తారా..?

రాజధానిపై అసెంబ్లీలో చెప్పిన దానికి భిన్నంగా చేస్తున్నారు.

ఉత్తరాంధ్రలో వలసలు ఆపలేకపోయారు.

మత్స్యకారులు ఏపీలోని సొంత తీరంలో వేట చేసుకోలేక.. గోవా, గుజరాత్, చెన్నై వలసపోతున్నారు.

రుషికొండను ధ్వంసం చేసి భవనం నిర్మించుకుంటున్నారు.

దసపల్లా భూములను జగన్ సన్నిహితులకు ధారాదత్తం చేస్తున్నారు.

ఇవన్నీ చేస్తున్నందుకు గర్జనలా..?

ఒకవైపు అమరావతి టు అరసవల్లి మహాపాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.