Pawan Kalyan: సీఎం జగన్‌కు పవన్ బహిరంగ లేఖ.. ఆ పింఛన్లు ఎందుకు తొలగించారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Open Letter To CM Jagan Mohan Reddy Over Pension Issue: జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 4 లక్షల మందికి పింఛన్ల తొలిగింపుపై ఇచ్చిన నోటీసుల అంశంపై పవన్ ఈ ఓపెన్ లెటర్ రాశారు. సామాజిక పింఛన్ల పరిధిలోకి వచ్చే వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా ఇచ్చే పింఛన్లను తగ్గించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని.. ఇది పేదలను ఇబ్బందిపాలు చేస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. పింఛన్లను ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ 4 లక్షల మందికి నోటీసులు జారీ చేశారని.. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులను పింఛన్లకు దూరం చేయడం కోసమే నోటీసులు ఇచ్చారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. పింఛన్ తొలగించడానికి చెప్తున్న కారణాలు సైతం సహేతుకంగా లేవని మండిపడ్డారు.
Tunisha Sharma Suicide Case: టీవీ నటి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. కీలకంగా మారిన సీసీ టీవీ పుటేజ్
Also Read
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
శ్రీకాకుళం జిల్లా మొళియాపుట్టి మండలంలో కొందరు వృద్ధులకు పింఛన్ల రద్దు నోటీసులు ఇచ్చారని.. ఒక్కొక్కరి పేరు మీద వేల ఎకరాల భూములున్నాయనే కారణం చూపారని పవన్ అన్నారు. అదే నిజమైతే.. ఆ వృద్ధులకు ఆ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే పెనుకొండలో రజక వృత్తిపై ఆధారపడిన రామక్క అనే పింఛనుదారుకి 158 ఇళ్లు ఉన్నాయని నోటీసులో చూపారని.. నిజంగా అన్ని ఇళ్లు ఉంటే అవెక్కడున్నాయో చూపించి, ఆ ఇళ్ల తాళాలు ఇవ్వాలని చెప్పారు. వీళ్లకు ఇళ్లు గానీ, భూములు గానీ లేవన్న సంగతిని వైసీపీ ప్రభుత్వం గమనించాలన్నారు. ఒకవేళ నిజంగానే ప్రభుత్వ రికార్డుల పరంగా వాళ్లు ఆస్తిపరులే అయితే.. పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టో, వాలంటీర్ల చుట్టో ఎందుకు తిరుగుతారని నిలదీశారు. విద్యుత్ బిల్లు పెరిగిందనో, ఇంటి విస్తీర్ణం ఎక్కువైందనో.. పింఛన్లు రద్దు చేయాలని చూడటం విచిత్రంగా ఉందన్నారు. పాతికేళ్ల కిందట చనిపోయినవారు ఇప్పటికీ ఆదాయపు పన్ను కడుతున్నారని నోటీసుల్లో చూపించి.. వితంతు పింన్లు రద్దు చేస్తామంటున్నారని, ఈ తరహా నోటీసులు సమర్థనీయమేనా? అని ప్రశ్నించారు. పేదలను ఆవేదనకు గురి చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
Ambati Rambabu: పవన్ బుద్ధి, జ్ఞానం లేని రాజకీయాలు చేస్తున్నాడు
తమ పార్టీ తరఫున చేపట్టిన జనవాణి కార్యక్రమంలో చాలామంది దివ్యాంగులు తమకు పింఛన్లు అందట్లేదని, పింఛన్లు రాకుండా అడ్డుకుంటున్నారని, వైకల్యాన్ని ధృవీకరించే సర్టిఫికెట్ల మంజూరు ఇబ్బందికరంగా మారిందని వాపోయారని పవన్ పేర్కొన్నారు. పింఛన్లు రద్దు నోటీసులపై వాస్తవ పరిస్థితుల్ని తెలియజేస్తుంటే.. వాటిని సరిదిద్దకపోగా ‘తిట్టండి’ అని జిల్లా కలెక్టర్లను ఆదేశించడం ద్వారా సీఎంగా మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించానని భావిస్తున్నారా? అని జగన్‌ని పవన్ నిలదీశారు. మీ పాలనలోని ఆర్థిక దివాళాకోరుతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెన్షన్ల తొలగింపు చేపట్టడమేంటని అడిగారు. లబ్దిదారుల సంఖ్యని తగ్గించుకోవాలని ఆలోచనని విరమించుకోవాలని, పింఛన్లు అందజేయడంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారనని ఆశిస్తున్నానని పవన్ ఆ లేఖలో కోరారు.
శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి @ysjagan గారికి ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి.
విషయం: సామాజిక పింఛన్ల తొలగింపు నిమిత్తం నోటీసులు జారీ చేస్తున్న తీరు గురించి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/QKnW6yXq6i
— JanaSena Party (@JanaSenaParty) December 28, 2022
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?