Ambati Rambabu: పవన్ బుద్ధి, జ్ఞానం లేని రాజకీయాలు చేస్తున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu Again Fires On Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ బుద్ధి, జ్ఞానం లేని రాజకీయాలు చేస్తున్నాడని.. చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి కాపులని మోసం చేస్తున్నారని ఆరోపించారు. పవన్‌కి బుద్ధి, జ్ఞానం లేదని.. అసలు అతనికి రాజకీయాలేంటో తెలుసా? అని ప్రశ్నించారు. తాను ఒక్క పైసా కూడా ఆశించనని, ఒక్క చోట కూడా గెలవని పవన్ తనపైనే ఆరోపణలు చేస్తాడా? అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీకి అధికారం రానివ్వను, ఓట్లు చీలనివ్వనని చెప్తున్న పవన్ అంత పెద్ద మగాడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా పవన్.. మా పవన్’ అంటూ కాపులంతా పవన్‌ని గోక్కుంటున్నారని.. ఆ కాపులంతా పవన్‌తో కలిసి చంద్రబాబుకి ఊడిగం చేయండంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను విమర్శినంత ఘాటుగా ఎవరూ విమర్శించరని, అందుకే పవన్ తనని టార్గెట్ చేశాడని అంబటి రాంబాబు వెల్లడించారు.
Bomb cyclone: గడ్డకట్టిన నయాగారా.. ఔరా అనిపిస్తున్న అద్భుత దృశ్యం
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
కాగా.. తన కొడుకు చనిపోయాక ప్రభుత్వం తనకు రూ. 5 లక్షల సాయం చేసిందని, అయితే అందులో మంత్రి అంబటి రాంబాబు వాటా అడిగారని ఇటీవల ఓ మహిళ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే! అప్పుడు ఓ బహిరంగ సభలో భాగంగా అంబటిని ఉద్దేశించి పవన్ పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ సమయంలోనే అంబటి ఆ వ్యాఖ్యలపై స్పందించారు. ఆ మహిళ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత.. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 12 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తించి, వారి కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇచ్చామన్నారు. ప్యాకేజీ తీసుకునే సన్నాసి రాజకీయాలు తాను చేయనని, రూ. 2 లక్షల తీసుకునే దౌర్భగ్యం ఉంటే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా చెప్పారు.
Vijayasai Reddy: జగన్, మోడీ భేటీపై.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Tags
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!