NTV Telugu Site icon

Pawan Kalyan: సీఎం జగన్‌కు పవన్ బహిరంగ లేఖ.. ఆ పింఛన్లు ఎందుకు తొలగించారు?

Pawan Open Letter To Jagan

Pawan Open Letter To Jagan

Pawan Kalyan Open Letter To CM Jagan Mohan Reddy Over Pension Issue: జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 4 లక్షల మందికి పింఛన్ల తొలిగింపుపై ఇచ్చిన నోటీసుల అంశంపై పవన్ ఈ ఓపెన్ లెటర్ రాశారు. సామాజిక పింఛన్ల పరిధిలోకి వచ్చే వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా ఇచ్చే పింఛన్లను తగ్గించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని.. ఇది పేదలను ఇబ్బందిపాలు చేస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. పింఛన్లను ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ 4 లక్షల మందికి నోటీసులు జారీ చేశారని.. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులను పింఛన్లకు దూరం చేయడం కోసమే నోటీసులు ఇచ్చారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. పింఛన్ తొలగించడానికి చెప్తున్న కారణాలు సైతం సహేతుకంగా లేవని మండిపడ్డారు.

Tunisha Sharma Suicide Case: టీవీ నటి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. కీలకంగా మారిన సీసీ టీవీ పుటేజ్

శ్రీకాకుళం జిల్లా మొళియాపుట్టి మండలంలో కొందరు వృద్ధులకు పింఛన్ల రద్దు నోటీసులు ఇచ్చారని.. ఒక్కొక్కరి పేరు మీద వేల ఎకరాల భూములున్నాయనే కారణం చూపారని పవన్ అన్నారు. అదే నిజమైతే.. ఆ వృద్ధులకు ఆ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే పెనుకొండలో రజక వృత్తిపై ఆధారపడిన రామక్క అనే పింఛనుదారుకి 158 ఇళ్లు ఉన్నాయని నోటీసులో చూపారని.. నిజంగా అన్ని ఇళ్లు ఉంటే అవెక్కడున్నాయో చూపించి, ఆ ఇళ్ల తాళాలు ఇవ్వాలని చెప్పారు. వీళ్లకు ఇళ్లు గానీ, భూములు గానీ లేవన్న సంగతిని వైసీపీ ప్రభుత్వం గమనించాలన్నారు. ఒకవేళ నిజంగానే ప్రభుత్వ రికార్డుల పరంగా వాళ్లు ఆస్తిపరులే అయితే.. పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టో, వాలంటీర్ల చుట్టో ఎందుకు తిరుగుతారని నిలదీశారు. విద్యుత్ బిల్లు పెరిగిందనో, ఇంటి విస్తీర్ణం ఎక్కువైందనో.. పింఛన్లు రద్దు చేయాలని చూడటం విచిత్రంగా ఉందన్నారు. పాతికేళ్ల కిందట చనిపోయినవారు ఇప్పటికీ ఆదాయపు పన్ను కడుతున్నారని నోటీసుల్లో చూపించి.. వితంతు పింన్లు రద్దు చేస్తామంటున్నారని, ఈ తరహా నోటీసులు సమర్థనీయమేనా? అని ప్రశ్నించారు. పేదలను ఆవేదనకు గురి చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Ambati Rambabu: పవన్ బుద్ధి, జ్ఞానం లేని రాజకీయాలు చేస్తున్నాడు

తమ పార్టీ తరఫున చేపట్టిన జనవాణి కార్యక్రమంలో చాలామంది దివ్యాంగులు తమకు పింఛన్లు అందట్లేదని, పింఛన్లు రాకుండా అడ్డుకుంటున్నారని, వైకల్యాన్ని ధృవీకరించే సర్టిఫికెట్ల మంజూరు ఇబ్బందికరంగా మారిందని వాపోయారని పవన్ పేర్కొన్నారు. పింఛన్లు రద్దు నోటీసులపై వాస్తవ పరిస్థితుల్ని తెలియజేస్తుంటే.. వాటిని సరిదిద్దకపోగా ‘తిట్టండి’ అని జిల్లా కలెక్టర్లను ఆదేశించడం ద్వారా సీఎంగా మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించానని భావిస్తున్నారా? అని జగన్‌ని పవన్ నిలదీశారు. మీ పాలనలోని ఆర్థిక దివాళాకోరుతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెన్షన్ల తొలగింపు చేపట్టడమేంటని అడిగారు. లబ్దిదారుల సంఖ్యని తగ్గించుకోవాలని ఆలోచనని విరమించుకోవాలని, పింఛన్లు అందజేయడంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారనని ఆశిస్తున్నానని పవన్ ఆ లేఖలో కోరారు.