NTV Telugu Site icon

Pawan Kalyan: పోలవరం సత్వరమే పూర్తి చేయండి.. కేంద్రమే చొరవ తీసుకోవాలి..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.. నిర్వాసితులకు పునరావాసం అమలుపైనా దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిశారు.. ఏపీకి జీవనాడి ఆయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర కాలయాపన చేస్తోందని… రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ సత్వరమే పూర్తి చేసేందుకు చొరవ చూపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.

Read Also: Paripurnanada : హిందువులకు మాత్రమే ఆధార్ కార్డులివ్వాలి..

రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ బహుళార్థక ప్రయోజనాలు అందిస్తుందని, ఇంతటి ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంలో నిధుల కొరత పేరుతో వైసీపీ ప్రభుత్వం జాప్యం చేయడంతో నిర్మాణ పురోగతి దెబ్బ తింటోందని షెకావత్ దృష్టికి తీసుకెళ్లాను పవన్‌ కల్యాణ్‌.. 2019 మే నాటికి పోలవరం ప్రాజెక్ట్ పనులు 72 శాతానికి పైగా పూర్తయితే గత నాలుగేళ్లలో 3 శాతం పనులు కూడా పూర్తి కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. విశాఖ పారిశ్రామిక జోన్ కు అవసరమైన నీటినీ, విశాఖ మెట్రో నగరానికి తాగు నీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ పనులు నిలిచిపోయాయని తెలిపారు. ప్రాజెక్ట్ పనులు ముందుకు వెళ్లకపోవడంపై వైసీపీ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందని షెకావత్ కి తెలిపారు. పోలవరం నిర్వాసితులకు అందించాల్సిన ఆర్. అండ్ ఆర్. విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన శ్రద్ధ చూపడం లేదన్నారు. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు, మిగిలిన 24 శాతం పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు కేంద్రం చొరవ తీసుకుని నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ మూలంగా విశాఖపట్నం, గోదావరి జిల్లాల తాగు నీరు, పారిశ్రామిక అవసరాలతోపాటు గోదావరి డెల్టాలోనే కాకుండా పక్కనే ఉన్న కృష్ణా డెల్టాలోని రైతాంగానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేయడానికి నిధులు అందించడంతోపాటు ఈ నిర్మాణంలో విషయంలో కేంద్ర ప్రభుత్వ తక్షణ జోక్యం అవసరమని సూచించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.