Social Media: ప్రస్తుతం రాజకీయ పార్టీ కార్యక్రమాలకు అయినా, సినిమా ప్రమోషన్‌లకు అయినా, వ్యాపారానికి సంబంధించిన ప్రమోషన్‌లకు అయినా సోషల్ మీడియా ప్రధానంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఫాలోవర్ల విషయం కూడా ఆసక్తిరేపుతోంది. ఈ అంశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు ఒకరితో ఒకరు పోటీ పడి ఫాలోవర్లను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. సోషల్ మీడియాకు సంబంధించి రాజకీయ నేతలు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను వాడుతున్నప్పటికీ ఎక్కువ ఫోకస్ మాత్రం ట్విటర్‌పైనే పెడుతున్నారు. ఏపీకి సంబంధించి అత్యధిక ఫాలోవర్లు ఉన్న రాజకీయ నేతల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టాప్‌లో ఉన్నారు. పవన్ ట్విటర్ ఫాలోవర్స్ సంఖ్య 5.2 మిలియన్లుగా ఉంది. ఈ జాబితాలో రెండో స్థానంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 4.9 మిలియన్లుగా ఉంది. 2009లోనే ట్విటర్ ఖాతా ప్రారంభించిన చంద్రబాబు తన వయసు 60 దాటినా యూత్‌తో పోటీ పడుతూ ఫాలోవర్లను సాధిస్తున్నారు. ట్విట్టర్ ఫాలోవర్ల విషయంలో సీఎం జగన్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆయన ఖాతాలో 2.4 మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు.
Read Also: Team India: ఈ ఏడాది చివరి మ్యాచ్ ఆడేసిన టీమిండియా.. టాప్ లేపింది ఎవరంటే..?
అయితే పవన్ కళ్యాణ్‌కు ఎక్కువ ఫాలోవర్లు ఉండటానికి కారణం ఆయన రెండు రంగాల్లో ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందే పవన్ సినిమాల్లో నటిస్తున్నారు. దీంతో సినిమాల పరంగానూ ఆయనకు ఫాలోవర్లు ఉన్నారు. అందువల్లే పవన్‌కు ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్నారు. లేకపోతే ఈ విషయంలో చంద్రబాబు అగ్రస్థానంలో ఉండేవారు. ఏపీకి చెందిన మిగతా ప్రధాన నేతల్లో చాలా మంది నేతలు 2 మిలియన్ లోపు ఫాలోవర్లతోనే ఉన్నారు. అటు రాజకీయ పార్టీల వారీగా చూస్తే.. జనసేన ట్విటర్ ఖాతాను 1.9 మిలియన్ ఫాలోవర్లు అనుసరిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాను 827K, తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతాను 547K ఫాలోవర్లు ఉన్నారు. కాగా రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికల ద్వారా తమ వాదనను, భావజాలాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నాయి.