NTV Telugu Site icon

Pawan Kalyan: రేపు తిరుపతికి పవన్.. అంజు యాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు

Pawan Tirupathi Anju Yadav

Pawan Tirupathi Anju Yadav

Pawan Kalyan Going To Tirupati To Give Complaint On Anju Yadav: తిరుపతిలోని శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తపై చెయ్యి చేసుకున్న సీఐ అంజు యాదవ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఖాకీ దుస్తుల్లో హుందాగా వ్యవహరించాల్సిన ఆమె.. వింతగా ప్రవర్తిస్తూ ఓ వ్యక్తిపై చెయ్యి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో.. ఈమధ్యకాలంలో ఆమె ఇంటరాగేషన్ చేసిన వీడియోలు సైతం బయటకొచ్చాయి. అవి నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఆమె చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ నేరుగా జనసేనాధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు.

Pilli Subhash Chandra Bose: బీసీ కుల గణనపై కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదు

పవన్ కళ్యాణ్ రేపు తిరుపతికి చేరుకొని.. శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ వ్యవహారంపై నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. రేపు ఉదయం 10.30 ప్రత్యేక విమానంలో తిరుపతికి పవన్ రానున్నారు. రానున్న పవన్ ఈ క్రమంలో.. తిరుపతి విమానాశ్రయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు జనసైనికులు బైక్ ర్యాలీ ప్లాన్ చేస్తున్నారు. సాయి అనే జనసేన కార్యకర్తపై అంజు చెయ్యి చేసుకుని నాలుగు రోజులు అవుతున్నా.. ఇప్పటివరకూ ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూపై ఇప్పటికే తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి డీఎస్పీకి నివేదిక పంపారు. అయితే.. అనుమతి లేకుండా ర్యాలి చేపట్టకూడదని జసనేన నేతలకు పోలీసులు సూచించారు. మరోవైపు.. పవన్ కళ్యాణ్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత ఢిల్లీకి పయనం కానున్నారు.

Alla Nani: పవన్, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా.. సీఎం జగన్‌ను ఏమి చేయలేరు

ఇదిలావుండగా.. అంజు యాదవ్‌పై గతంలోనూ వివాదాలు వచ్చాయి. విధి నిర్వహణలో పలు కేసుల విచారణ సమయంలో చార్జి మెమోలు, ఎంక్వైరీలను ఆమె ఎదుర్కున్నారు. ఇప్పుడు జనసేన కార్యకర్తపై చెయ్యి చేసుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇదే టైంలో.. ఆమె తొడకొడుతున్న వీడియో కూడా ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియో తీస్తున్న వ్యక్తి, కేసు పెట్టినందుకే తమ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని చెప్తుండగా.. అంజు యాదవ్ తొడకొడుతూ గట్టిగట్టిగా నవ్వుతూ చూసుకుందామన్నట్టుగా ఆ వీడియోలో కనిపించారు. మరి.. లీవ్‌లో ఉన్న అంజు యాదవ్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.