NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్ హెచ్చరిక.. సైలెన్సర్లు బిగించుకోకపోతే, మంత్రుల చిట్టా విప్పుతా

Pawan Kalyan Warns

Pawan Kalyan Warns

Pawan Kalyan Gives Strong Warning: తన వారాహి యాత్రలో భాగంగా భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ఓ హెచ్చరిక జారీ చేశారు. పదే పదే తన వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలందరూ తమ నోటికి సైలెన్సర్ బిగించుకోవాలని అన్నారు. తాను ప్రభుత్వ పాలసీలపై మాట్లాడుతుంటే.. తనపై వ్యక్తిగతంగా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో పెరిగిన సీఎం జగన్ వ్యక్తిగత జీవితం గురించి తనకు లోతైన విషయాలు తెలుసని.. తలచుకుంటే తాను కూడా సీఎంతో పాటు మంత్రుల చిట్టా విప్పగలనని హెచ్చరించారు. తాను చెప్పేది వింటే.. జగన్ చెవుల్లో రక్తం కారుతుందని వ్యాఖ్యానించారు. అయితే.. తనకు సంస్కారం ఉంది కాబట్టి, చిల్లర మాటలు మాట్లాడట్లేదన్నారు. జగన్ గుర్తు పెట్టుకో.. ఫ్యాక్షన్ బ్యగ్రౌండ్ అని మిడిసిపడకని అన్నారు. తాను విప్లవ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

Rashmi Gautham : వెరైటీ డ్రెస్సులో కిల్లింగ్ ఫోజులతో మతిపోగొడుతున్న రష్మీ.

రాబోయే 25 ఏళ్ళు ఒక కూలీగా పని చేసేందుకు తాను వచ్చానని, వచ్చే ఎన్నికల్లో తనని మనస్పూర్తిగా గెలిపిస్తారని కోరుకుంటున్నానని పవన్ అన్నారు. సినిమా అభిమానుల్ని విడదీయడం తనకు ఇష్టం లేదని, అందరినీ ఆంధ్రప్రదేశ్ యువతగా మాత్రమేనని చూస్తానని అన్నారు. భీమవరంలో పోస్టర్ గొడవ జరిగితే తనకు చాలా బాధేసిందన్నారు. అప్పులు చేయడం వల్ల ఎక్కువ వడ్డీల రూపంలో పోతున్నాయన్నారు. భీమవరం 38 వార్డులతో పాటు రాష్ట్రమంతా కమిటెడ్ నాయకత్వం రావాలన్నారు. ఒక పదేళ్లు అన్ని మర్చిపోయి అంతా ఏకమవుదామని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి రూ.25 లక్షల ఇన్సూరెన్స్ ఉండేలా పాలసీ ఉండాలన్నారు. జన సైనికులకే రూ.5 లక్షల ఇన్సూరెన్స్ చేసినపుడు.. రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కుటుంబాలకు ఎందుకు చేయలేవని ప్రశ్నించారు. తన స్వార్థం కోసం చూసుకునే మనిషిని కానని అన్నారు. ఏది ఏమైనా తాను పోరాటం ఆపనన్నారు. కులవైషమ్యాలు వదిలేయడం అలవాటు చేసుకుందామని పిలుపునిచ్చారు.

Pawan Kalyan: నాకు గెలుపోటములు ఉండవు.. ప్రయాణం తప్ప

తనకు ఢిల్లీ స్థాయి నాయకులతో పరిచయాలు ఉన్నాయని.. తాను ప్రధానిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి గురించి అన్ని చెప్పొచ్చని పవన్ అన్నారు. జనసేన అధికారంలోకి వచ్చినప్పుడు.. అందరి బండారం బట్టబయలు చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. రైతు నాయకులపై కేసులు పెట్టారని, తుందుర్రు ఆక్వా పార్క్ కోసం పోరాటం చేసిన వారిపై ఇంకా కేసులు ఉన్నాయని, తాము వచ్చాక వాటిని తీసేస్తామని హామీ ఇచ్చారు. దళితులపై కేసులు పెడుతున్న పట్టించుకోవడం లేదన్నారు. అభివృద్ధి జరగాలన్నా, ఆరచకాలు ఆగాలన్నా వైసీపీ పోవాలని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.