Site icon NTV Telugu

Pawan Kalyan: వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

పీఆర్సీ విషయంలో జనసేనపై, తనపై చేస్తున్న కామెంట్లపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలపై. పవన్ కళ్యాణ్ స్పందించారు. తాను ప్రజల దత్తపుత్రుడిని అన్నారు పవన్. మంత్రులే ఉద్యోగులను రెచ్చగొట్టారు.ప్రభుత్వానికి అందరూ శత్రువులుగా కనిపిస్తారు

ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తామేదో వారిని రెచ్చగొడుతున్నట్టు వచ్చిన వార్తలపై పవన్ మండిపడ్డారు. పీఆర్సీ అంశం ఉద్యోగులు ఎవరికీ సంతృప్తి ఇవ్వలేదన్నారు పవన్. అదే విషయాన్ని తాము పేర్కొన్నామన్నారు. ప్రభుత్వంపై ఎవరైనా సహేతుక విమర్శలు చేస్తే దాన్ని స్వీకరించకుండా మాపై దాడి చేశారన్నారు. సీపీఎస్ అంశం ఎన్నికల హామీ అన్నారు పవన్, లక్షలాదిమంది ఉద్యోగులు కడుపుమండి రోడ్ల మీదకు వస్తే దానికి కారణం మేం కాదన్నారు.

డూడూ బసవన్నలా మీరేం చేసినా తల ఊపాలి. టీచర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు వెళితే మాకేం సంబంధం. వెటకారాలతో ఏం జరగదు. మంచి జరిగేది చూడండి. మీకు నచ్చని సలహాలిస్తే న్యాయవ్యవస్థలోని న్యాయమూర్తులపై కూడా వైసీపీ నేతలు విమర్శలు చేశారని మండిపడ్డారు పవన్.

పీఆర్సీ, ఉద్యోగుల జీతాలకు సంబంధించిన అంశం తాము సృష్టించింది కాదన్నారు. ఆధిపత్య ధోరణి అనే పదం ప్రభుత్వ సలహాదారు సజ్జల గారికి నచ్చినట్టు లేదు. ఉద్యోగుల్ని ముందే పిలిచి చర్చించి వుంటే విపక్షాలు మాట్లాడే అవకాశం వుండేది కాదన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను, డిమాండ్లన సానుకూలంగా పరిశీలించి వుండాల్సిందన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Exit mobile version