Pawan Kalyan: జగన్ సర్కార్ కూడా పెట్రోల్ రేట్లను తగ్గించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం హర్షణీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ఓ లేఖ విడుదల చేశారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో బెంబేలెత్తుతున్న ప్రజలకు పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గింపు ఉపశమనం ఇస్తుందని పవన్ తన లేఖలో అభిప్రాయపడ్డారు. నిత్యావసర ధరల పెరుగుదలకు ఇంధన రేట్లే కారణమని.. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో నిత్యావసరాల ధరలు కొంత వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. పీఎమ్ ఉజ్వల యోజన పథకంలో అందించే గ్యాస్ సిలిండర్లపై రూ.200 తగ్గించడం పేదవారికి ఆర్థిక మేలు చేకూరుస్తుందని తెలిపారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు హర్షణీయం – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/mNNiTl7HuP
Also Read
- Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
- Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
— JanaSena Party (@JanaSenaParty) May 22, 2022
పెట్రోల్ రేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గాన్ని వైసీపీ ప్రభుత్వం అనుసరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇంధన ధరలపై స్థానిక పన్నులు అన్ని రాష్ట్రాలలో కంటే ఏపీలోనే అధికంగా ఉన్నాయని పవన్ ఆరోపించారు. అసలే అస్తవ్యస్థమైపోయిన రోడ్లతో ఏపీ ప్రజల ప్రయాణం భారంగా మారిందని.. వాహనాలు మరమ్మతులకు లోనై ప్రజలు అల్లాడిపోతున్నారని పవన్ తెలిపారు. పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై రోడ్డు సెస్ పేరుతో ప్రజల నుంచి ఏటా జగన్ సర్కారు రూ.600 కోట్లు వసూలు చేస్తోందని గుర్తుచేశారు. అయినా రోడ్లను బాగు చేసే పరిస్థితి ఎలాగూ కనిపించడం లేదన్నారు. కనీసం పెట్రోలు, డీజిల్‌పై స్థానిక పన్నులను తగ్గించి ప్రజలకు ఊరట కలిగించాలని పవన్ హితవు పలికారు.
మరోవైపు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన పద్మశ్రీ వనజీవి రామయ్య త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. రామయ్య సంపూర్ణ ఆరోగ్యవంతులై పర్యావరణ పరిరక్షణకు పునరంకితం కావాలని అభిలషిస్తున్నట్లు ట్వీట్‌లో వివరించారు. పచ్చదనం కోసం ఆయన పడే తపన, చూపే శ్రద్ధ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలిస్తాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన పద్మశ్రీ ‘వనజీవి’ రామయ్య గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. రామయ్య గారు సంపూర్ణ ఆరోగ్యవంతులై పర్యావరణ పరిరక్షణకు పునరంకితం కావాలి. పచ్చదనం కోసం ఆయనపడే తపన… చూపే శ్రద్ధ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని కలిగిస్తాయి. pic.twitter.com/100oNpbTcD
— Pawan Kalyan (@PawanKalyan) May 22, 2022
తాజావార్తలు
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!