Site icon NTV Telugu

Pawan Kalyan: ఏపీ భవిష్యత్ కోసం పొత్తులు కావాల్సిందే

Pawan Tpt

Pawan Tpt

ఎన్నో ప్రజల సమస్యలతో పాటు వైసీపీ కబ్జాలు, దౌర్జన్యాలు ఎన్నో నా దృష్టికి వచ్చాయి..రాయలసీమలో సమస్యలు చెప్పాలంటే భయపడుతున్నారన్నారు పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan)..సీమ నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ ఇక్కడ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు పవన్ కళ్యాణ్. తిరుపతిలో జరిగిన జనవాణిలో పవన్ జనం నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల గురించి చెప్పిన వారి మామిడి చెట్లు నరికి, బోర్లు విరగొట్టారు….సీమలో కొన్ని కులాలే బాగుపడుతున్నాయి. మిగిలిన కులాల వారికి రాజకీయ సాధికారత దక్కాలి. అప్పుడే సీమ అభివృద్ధి చెందుతుంది….

ఇవాళ పంచాయితీ నిధులను దారి మళ్ళించారు…ఫ్యాక్షన్ సీమ చదువుల సీమ కావాలి…పులివెందుల హింసకు పర్యాయపదం అయ్యింది…సీమ ప్రజలు ప్రేమతో చేతులు కట్టుకోవాలి, భయంతో కాదు….కులాన్ని అమ్ముతున్నావని నన్ను విమర్శిస్తున్నారు… మాకేం పని లేదా? దేశంలోనూ, రాష్ట్రం లోనూ రాజకీయంగా మూడో ప్రత్యామ్నాయం ఉండాలి…మా అన్న చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఓ మార్పు ఆశించాము… నాడు వైఎస్సార్ కోవర్టుల వల్ల ఆ ఫలితం దక్కలేదు. కుళ్ళు, కుట్ర రాజకీయాల్లో చిరంజీవి నిలబడలేక పోయారు.

Read Also: Amit Shah: తెలంగాణ ప్రభుత్వాన్ని మారిస్తేనే.. సమస్యలు తీరుతాయి

నేను ఇవాళ దేనికీ భయపడను… మార్పు కోసం బలంగా నిలబడుతున్నాను… నా ఆస్తులు లాక్కున్నా భయపడేది లేదు…2014 ఎన్నికల్లో నాటి ప్రధాని అభ్యర్థి మోడీ చెప్పడం వల్లే టీడీపీతో కలిసాము…మునుగోడు లో పోటీ చేద్దామని మా వాళ్ళు అడిగితే వద్దని అన్నాను. తెలంగాణ సాధారణ ఎన్నికల్లో పరిమిత స్థానాల్లో పోటీ చేస్తాము…విధ్వంస రాజకీయాలు చేస్తున్నప్పుడు శతృవులతో కూడా కలుస్తాము…ఏపి భవిష్యత్ కోసం కొన్ని పొత్తులు పెట్టుకుంటాము.. అవెంజర్స్ సినిమాలో థామస్ ఆరు రాళ్ల కోసం ప్రయత్నించి అందరినీ చంపుతాడు. అలా మన ఆంధ్రా థామస్ నవరత్నాలు అంటూ మనల్ని చంపుతున్నాడు… ఇవాళ నుంచి ఆయన్ను మనం ఆంధ్రా థామస్ అని పిలుచుకు0టాం. సజ్జల మాటల్లో ఆధిపత్య ధోరణి తగ్గించుకోవాలి…. దూరంగా వాహనాలు ఆపి, నడిపించి ఇంటిలోకి తీసుకెళ్ళే వారి ప్రవర్తనలో మార్పు రావాలన్నారు పవన్ కళ్యాణ్.కార్తీకేయ్ సినిమా దేశం మొత్తం ఊపేస్తోంది…సినిమా పరిశ్రమ ఒక్క మెగా కుటుంబానికి మాత్రమే కాదు కధ ..అందరిది…అదే రాజకీయాల్లోను, పదవుల్లోను అందరికీ అవకాశాలు ఉండాలి. ఆధిపత్యం రాజకీయాలను వదలాలన్నారు పవన్ కళ్యాణ్.

Exit mobile version