Site icon NTV Telugu

జల వివాదంపై స్పందించిన జనసేనాని.. సీఎంల సఖ్యత ఏమైంది..?

Pawan

Pawan

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం హీట్‌ పెంచుతోంది… ఇరు రాష్ట్రాల మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, రెండు రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఫిర్యాదులు వెళ్తూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో జల వివాదంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. అమరావతిలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నానన్న పవన్.. ఇద్దరు సీఎంలు చాలా సఖ్యతగా ఉంటున్నామని ప్రకటించారని, మరి వివాదాలు ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ డ్రామాగా ఉందని ఎద్దేవా చేశారు. మరోవైపు నిరుద్యోగ యువత కోసం త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు పవన్ కల్యాణ్.. ఎన్నికల ముందు లక్షల్లో ఉద్యోగాలు అని చెప్పి కేవలం మూడు వేల ఉద్యోగాలు ప్రకటించారని విమర్శించిన ఆయన. నిరుద్యోగ యువతకి అండగా ఉంటాం.. దీనిపై త్వరలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు..

Exit mobile version