Site icon NTV Telugu

అఖిల పక్షంను పిలవండి : పవన్‌ కళ్యాణ్‌

విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పోరాటం చేస్తోంది. వారికి సంఘీభావం తెలిపేందుకు విశాఖకు చేరుకున్న పవన్‌.. కూర్మన్నపాలెం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంతో విన్నవించి విశాఖ ప్రైవేటీకరణను ఆపాలని కోరారు.

అవసరమైతే సీఎం జగన్‌ అఖిలపక్షాన్ని పిలవండి అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రతి యువకుడు జైతెలంగాణ అంటేనే తెలంగాణ వచ్చిందని.. కానీ ఆంధ్రాలో అందరూ ఆంధ్రాకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదన్నారు. వారం రోజుల లోపు అఖిల పక్షాన్ని పిలవాలని కోరారు.

Exit mobile version