NTV Telugu Site icon

Paritala Sriram: పవన్ కళ్యాణ్‌కు గుండు కొట్టిన పరిటాల రవి.. పరిటాల శ్రీరామ్ ఏం చెప్పారంటే..?

Paritala Sriram

Paritala Sriram

Paritala Sriram: గతంలో ఓ వివాదంలో టాలీవుడ్ స్టార్ హీరో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు అప్పటి టీడీపీ నేత పరిటాల రవి గుండు కొట్టించారని తెగ ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో నిజానిజాలేంటో ఎవ్వరికీ తెలియదు. కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చెప్పేస్తుంటారు. స్వయంగా మంత్రి రోజా కూడా ఓ సందర్భంలో పవన్‌ను విమర్శిస్తూ ఈ గుండు ప్రస్తావన తెచ్చారు. అయితే ఈ ప్రచారం మీద తాజాగా పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అసలు పవన్ కళ్యాణ్‌కు నిజంగానే పరిటాల రవి గుండు కొట్టించారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు పరిటాల శ్రీరామ్ సమాధానం ఇచ్చారు.

Read Also: Unstoppable 2: బాలయ్య షోలో ప్రభాస్, గోపీచంద్

పవన్ కళ్యాణ్ మంచి నటుడు అని.. ఆయనకు సొసైటీ పట్ల ఎంతో కన్సర్న్ ఉందని పరిటాల శ్రీరామ్ అన్నారు. ఓ నాయకుడు ఎదిగే సమయంలో ఇలాంటి రూమర్లు వస్తుంటాయని.. ఇదంతా సర్వసాధారణమేనని తెలాపారు. అయితే ఆరోపణల్లో ఎంతో కొంత నిజం ఉంటే వాటిపై స్పందించొచ్చు అని.. నిరాధారమైన ఆరోపణలు చేసినప్పుడు ఎలా స్పందిస్తామని అన్నారు. పవన్‌ను తక్కువ చేసి చూపించడానికే ఇలాంటి రూమర్లు క్రియేట్ చేస్తున్నారని పరిటాల శ్రీరామ్ అసహనం వ్యక్తం చేశారు. పవన్‌తో తమకు మంచి సంబంధాలే ఉన్నాయని స్పష్టం చేశారు. వాళ్లు ఎన్ని రూమర్లు క్రియేట్ చేసినా.. పవన్ అర్థం చేసుకోగలరు అని కొనియాడారు. ఆయన్ను నెగిటివ్ చేయడానికి మాట్లాడే మాటలే తప్ప తన తండ్రి గుండు కొట్టించారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పరిటాల శ్రీరామ్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికైనా ఇలాంటి ఆరోపణలకు ఫుల్‌స్టాప్ పెట్టాలన్నారు.

Show comments