Site icon NTV Telugu

AP MLC Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్‌.. టీడీపీ అభ్యర్థి విజయం

Panchumarthi Anuradha

Panchumarthi Anuradha

AP MLC Election Results: మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థికి ఓటమి తప్పలేదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు.. ఆమెకు 23 ఓట్లు వచ్చాయి.. అయితే, ఎమ్మెల్యే కోటాలోని ఏడు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏడుగురు అభ్యర్థులను బరిలోకి దింపగా.. టీడీపీ అధినేత చంద్రబాబు.. తమ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధాను ప్రకటించారు.. ఇక, ఈ ఎన్నికలపై ఆదినుంచి టెన్షన్‌ నెలకొంది.. ఏడు స్థానాలు మేమే కైవసం చేసుకుంటామని అధికార వైసీపీ నేతలు చెబుతూ రాగా.. ఆ ఒక్కటి మాదే.. అని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.. మొత్తంగా 23 ఓట్ల రావడంతో టీడీపీ అభ్యర్థి అనురాధ విక్టరీ కొట్టారు..

మరోవైపు.. ఇప్పటి వరకు వైసీపీ అభ్యర్థులు మర్రి రాజశేఖర్, పెనుమత్స సత్యనారాయణ రాజు విజయం సాధించారు.. 22 ఓట్లతో ఇద్దరు వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు.. పోతుల సునీత, ఏసురత్నం, ఇజ్రాయెల్ కూడా విజయం సాధించారు.. కోలా గురువులు, జయ మంగళలో ఒకరి ఓటమి ఖాయం అయ్యింది. సెకెండ్, థర్డ్ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది.

Exit mobile version