Site icon NTV Telugu

Sattenapalle: విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు

Palnadu

Palnadu

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విషాదం నెలకొంది. అమరావతి మేజర్ కెనాల్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. వృత్తిని రాఘవేంద్ర బాలకుటిర్‌కు చెందిన మొత్తం ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. అయితే.. కెనాల్‌లో దిగిన వీరు కొట్టుకుపోతుండటంతో స్థానికులు చూసి ముగ్గురిని కాపాడారు. మరో ఇద్దరు కెనాల్‌లో కొట్టుకుపోయారు. కొట్టుకుపోయిన వారిలో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరొకరి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టింది.

Exit mobile version