Chit Fund Fraud: పల్నాడు జిల్లాలో సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ మోసాలపై పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. విజయ లక్ష్మీ టౌన్ షిప్ పేరుతో నడుపుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలో 2.8 కోట్ల రూపాయలు నష్టపోయామని సుబ్బారెడ్డి అనే బాధితుడు పల్నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు, అదే కంపెనీలో తాను 11 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయానని గుంటూరు జిల్లా పట్టాభిపురంలో పోలీసులకు దండా రాజ్య లక్ష్మీ అనే మహిళ వ్యాపారవేత్త కంప్లైంట్ చేసింది.
Read Also: Jr NTR: కబీర్ vs వీరేంద్ర రఘునాథ్.. ఎన్టీఆర్ ప్లాన్ పెద్దదే!
ఇక, వరుసగా వస్తున్న ఫిర్యాదులతో ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యం బాధితులను మోసం చేసిందని నిర్ధారించుకున్నారు. ఇలా, వరుసగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులకు క్రమంగా ఫోన్లో సైతం పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో.. ఈ ఘటనపై జిల్లా పోలీస్ యంత్రాంగం సీరియస్ గా తీసుకుంది. దీంతో ఆ చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి.. సమగ్ర విచారణ చేస్తున్నారు. వారం పది రోజుల్లో ఈ కేసును కొలిక్కి తెస్తామని నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు.