Site icon NTV Telugu

Double Murder Case: అజ్ఞాతంలోకి పిన్నెల్లి బ్రదర్స్‌..? డబుల్‌ మర్డర్ కేసులో పోలీసుల గాలింపు..

Pinnelli Brothers

Pinnelli Brothers

Double Murder Case: పల్నాడు జిల్లాలో వెల్దుర్తి మండలం గుండ్లపాడులో TDP నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు సోదరులు దారుణ హత్యకు గురయ్యారు. 15 రోజుల క్రితం వీళ్లను కారుతో గుద్ది చంపారు ప్రత్యర్థులు. ఈ కేసులో గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, గురవయ్య, దొంగరి నాగరాజు, తోట వెంకటేశ్వర్లు, గెల్లిపోగు విక్రమ్ లను అరెస్ట్ చేశారు పోలీసులు.

Read Also: Hyderabad: సీఎం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. 65 వేల కొత్త ఆటో రిక్షాలకు అనుమతి

ఈ కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ7గా ఉన్నారు. అలాగే, 8వ నిందితుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డి, తొమ్మిదో నిందితుడు పిన్నెల్లి వెంకట రెడ్డిని చేర్చారు పోలీసులు. ప్రస్తుతం వీరు ముగ్గురు అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో వాళ్ల కోసం గాలిస్తున్నారు పోలీసులు. జంట హత్య కేసులో ముందస్తు బెయిల్‌ కోసం పిన్నెల్లి సోదరులు ప్రయత్నిస్తున్నారు. దీంతో బెయిల్‌ వచ్చే లోపే వాళ్లను అరెస్టు చేయాలనే పట్టుదలతో ఉన్నారు పోలీసులు.

Read Also: Indian Railway: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక నాన్ ఏసీ కోచ్‌లలోనూ ఏసీ కోచ్‌ల సౌకర్యాలు..!

కాగా, టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన విషయం విదితమే.. వారిపై 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ప్రత్యక్ష సాక్షి, మృతుల బంధువు తోట ఆంజనేయులు ఫిర్యాదు మేరకు… ఏ1గా జవిశెట్టి శ్రీను ఎలియాస్‌ బొబ్బిలి, ఏ2గా తోట వెంకట్రామయ్య, ఏ3గా తోట గురవయ్య, ఏ4గా దొంగరి నాగరాజు, ఏ5గా తోట వెంకటేశ్వర్లు, ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై కేసులు నమోదు చేశారు వెల్దుర్తి పోలీసులు. అయితే, మే 24న ఓ శుభకార్యానికి బైక్‌పై వెళ్లి వస్తున్న టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులను వెల్దుర్తి మండలం బోదిలవీడు సమీపంలో ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టి.. రాళ్లతో మోది హత్యచేసి పారిపోయిన విషయం విదితమే..

Exit mobile version